ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రెటీలు.. ఎవరంటే

0
483

రంగుల ప్రపంచంలో సెలబ్రెటీల మనస్థత్వాలు కూడా భిన్నంగా మారిపోతున్నాయి. ఇప్పుడైతే వైరల్ అయ్యింది కాబట్టి పవిత్రా లోకేశ్-సీనియర్ నటుడు నరేశ్ గురించి తెలుస్తుంది కానీ గతంలో చాలా మంది సెలబ్రెటీలు రెండు, అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు, లివింగ్ లో ఉన్నారు. భార్య చనిపోతే తోడు కోసం కొందరైతే.. మనస్పర్థలతో విడాకులు తీసుకొని మరికొందరు మరో పెళ్లికి సిద్ధమయ్యారు. వారి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

చర్చకు వస్తున్న పేర్లు నరేశ్-పవిత్రా

కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో బాగా చర్చకు వస్తున్న పేర్లు నరేశ్-పవిత్రా లోకేశ్. ఆయనకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు కాగా రీసెంట్ గా నాల్గో వ్యక్తిగా పవిత్ర లోకేశ్ నరేశ్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. వీరిని ఏడాది క్రితం ఒక రూంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి. ఇప్పుడీ వ్యవహారం 2023లో పెళ్లి చేసుకుంటామనే వరకు చేరింది.

సీనియర్ హీరోయిన్, డైరెక్టర్ విజయ నిర్మల కొడుకు నరేశ్. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి అనతి కాలంలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అప్పట్లో సీనియర్ సినిమాటో గ్రాఫర్ అయిన శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు నరేశ్. వీరికి ఒక కొడుకు (నవీన్ విజయ్ కృష్ణణ్) కూడా పుట్టాడు. తర్వాత రచయిత దేవుపల్లి కృష్ణశాస్త్రి మనుమరాలు రేఖా సుప్రయను వివాహం చేసుకున్నాడు.

ఒక కొడుకు పుట్టాడు

వీరికి కూడా ఒక కొడుకు పుట్టాడు. మనస్పర్థలతో ఆమెకు విడాకులు ఇచ్చి కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి తమ్ముడి కూతురు రమ్యా రఘుపతిని మూడో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా మరో కొడుకు పుట్టాడు. ఇటీవల ఆమెకు విడాకులు ఇస్తున్నానని ప్రకటించి పవిత్రా లోకేశ్ తో సహజీవనం చేస్తున్నాడు.

మొదటి పెళ్లి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగితో

ఇక పవిత్రా లోకేశ్ విషయానికి వస్తే ఆమె తండ్రి పేరు మైసూర్ లోకేశ్. ఆయన కూడా సినీ ఆర్టిస్టే. 16 సంవత్సరాలలో ఇండస్ట్రీలోకి వచ్చిన పవిత్రా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది. ప్రస్తుతం కో యాక్టర్గా చిన్న చిన్న పాత్రలు వేస్తుంది. ఆమె మొదటి పెళ్లి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగితో జరిగింది. తర్వాత మనస్పర్థలతో వారు విడాకులు తీసుకున్నారు.

తర్వాత సుచీంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేసి 2018 నుంచి ఆయనతో కూడా విడిపోయి ఒంటరిగా ఉంటుంది. ఇటీవల నరేశ్ తో సహజీవనం చేస్తుంది. ఆమె జీవితంలో నరేశ్ మూడో వ్యక్తి కాగా.. నరేశ్ జీవితంలో పవిత్ర నాలుగో వ్యక్తి

విష్ణు విశాల్

కోలివుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ గుత్తా జ్వాలను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది ఇద్దరికి కూడా రెండో వివాహమే. కరోనా నిబంధనల మద్య ఇద్దరూ ఒకింటి వారయ్యారు.

దియా మిర్జా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మిర్జా కూడా రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని గతేడాది పెళ్లి చేసుకుంది.

సునీత

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత 19 సంవత్సరాలకే వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. తర్వాత భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఆమె విడాకులు ఇచ్చి కొంత కాలం ఒంటరి జీవితం గడిపింది. ఇటీవల మీడియా పర్సన్ అయిన రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది.

వనీత విజయ్ కుమార్

రుక్మిణి, దేవి లాంటి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది వనీత విజయ్ కుమార్. పీటర్ పాల్ అనే తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. కానీ ఆమెకు ఇది మూడో వివాహం. అప్పటికే ఆమె ఇద్దరిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం పీటర్ పాల్ కు కూడా విడాకులు ఇస్తుందని చర్చ జరుగుతోంది.

దిల్ రాజు

దిల్ రాజు మొదటి భార్య చనిపోవడంతో చాలా రోజులు ఒంటరి జీవితం అనుభవించాడు. తర్వాత ఆయన కుమార్తె ఒత్తిడితో తనకన్నా చాలా చిన్న వయసున్న తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.

నాగార్జున

అక్కినేని నాగార్జున వెంటేశ్ చెల్లలు, రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు. వీరికి ఒక కొడుకు నాగ చైతన్య కూడా పుట్టాడు. తర్వాత మరో హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. వీరికి కూడా అఖిల్ జన్మించాడు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ 1997లో నందిని అనే యువతిని వివాహం చేసుకున్నాడు. తర్వాత 2008లో హీరోయిన్ అయిన రేణూ దేశాయ్ ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి రష్యన్ యువతి అన్నా లెజినివాను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంట ప్రస్తుతం కాపురం చేస్తున్నారు.

సామ్రాట్ రెడ్డి

నటుడు సామ్రాట్ రెడ్డి 5 నవంబర్, 2010న అంజనా శ్రీ లిఖితను రెండో వివాహం చేసుకున్నాడు. హర్షిత రెడ్డికి విడాకులు ఇచ్చిన తర్వాత ఆమన శ్రీ లఖితకు తాళి కట్టి రెండో భార్యగా తెచ్చుకున్నాడు.

విజయదుర్గ

చిరంజీవి చెల్లి, హీరో సాయిధరమ్ తేజ్ తల్లి విజయదుర్గ రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తకు పుట్టిన సాయి ధరమ్ తేజ్ తన తల్లికి పెళ్లి చేశాడు. అమ్మ ఒంటిరి జీవితం చూడలేకనే రెండో పెళ్లికి ఒప్పించినట్లు సాయి ధరమ్ తేజ్ చెప్పాడు.

శ్రీజ

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ఇద్దరిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం రెండో భర్తను కూడా విడిచిపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీజ మొదట శిరీష్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది. వారికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత విడిపోయింది. తర్వాత చిరంజీవి కళ్యాణ్ దేవ్ కు ఇచ్చి వివాహం చేశారు. కళ్యాణ్ దేవ్ కు కూడా ఇది రెండో పెళ్లి. వీరికి కూడా బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు వారు విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కృష్ణ- విజయ నిర్మల

సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిర. తర్వాత ఆయనకు విజయ నిర్మలతో పరిచయం ఏర్పడడంతో ఆమెను రెండో పెళ్లి చేసుకుంటానని ఇందిరకు చెప్పాడు. ఆమె కూడా దానికి ఒప్పుకుంది. దీంతో విజయ నిర్మలను ఆయన రెండో వివాహం చేసుకున్నారు.

కృష్ణం రాజు

రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి మరణం తర్వాత చాలా కాలం ఒంటరిగా ఉన్నారు. ఆ తర్వాత శ్యామలా దేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు జన్మించారు. వీరి కంటే ముందు కృష్ణం రాజు మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

నందమూరి తారక రామారావు

ఎన్టీఆర్ విలువలకు కట్టుబడి ఉండే మనిషి. ఆయన చిత్రాలతో పాటు చాలా వ్యక్తిత్వం కూడా గొప్పగా ఉంటుంది. ఆయన భార్య బసవతారకం చనిపోయిన తర్వాత చాలా కాలం ఒంటిరి జీవితం గడిపారు. తర్వాత లక్ష్మీ పార్వతి ఆయనపై చూపించిన అభిమానంతో ప్రేమ వివాహం చేసుకున్నారు.

నందమూరి హరికృష్ణ

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హరికృష్ణ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిని రెండో వివాహం చేసుకున్నాడు.

ప్రకాశ్ రాజ్

డిస్కోశాంతి చెల్లి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకున్నారు ప్రకాశ్ రాజ్. కొన్ని కారణాల వల్ల విడిపోయి 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో వివాహం చేసుకున్నారు.

ప్రభుదేవా

కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా చాలా విభాగాల్లో పని చేశారు ప్రభుదేవా. ఆయన మొదటి వివాహం రమాలత్ తో 20 సంవత్సరాల క్రితం జరిగింది. తర్వాత వారు విడిపోయారు. నయనతారతో పెళ్లి వరకూ వ్యవహారాన్ని నడిపించిన ప్రభుదేవా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇటీవల తనకు ఫిజియోథెరపీ చేసిన డాక్టర్ ను రెండో వివాహం చేసుకున్నారు ప్రభుదేవా.

కమల్ హాసన్

కమల్ హాసన్ తన 24వ ఏటా 1978లో వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. పదేళ్ల తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. తర్వాత సారికతో సహజీవనం మొదలు పెట్టాడు. శృతీ హాసన్ పుట్టిన తర్వాత 1986లో సారికను రెండో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి ఆమెను కూడా విడిచిపెట్టిన కమల్ హాసన్ గౌతమి, సిమ్రాన్ బుగ్గ లాంటి వారితో సహజీవనం చేశాడు.

మోహన్ బాబు

మోహన్ బాబు తన భార్య చెల్లినే రెండో వివాహం చేసుకున్నారు. ఆయన వివాహం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల్లోకి ఆయన మొదటి భార్య విద్యాదేవి చనిపోయింది. దీంతో ఆమె చెల్లి నిర్మలా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన వారే విష్ణు, మనోజ్, లక్ష్మి.

ఆది నారాయణ రావు

నిర్మాత, సంగీత దర్శకుడు ఆదినారాయరావు కూడా రెండో వివాహం చేసుకున్నారు. ఆయనను రెండో పెళ్లి చేసుకునేందుకు సీనియర్ నటి అంజలి సమ్మతించడంతో వీరిద్దరూ ఒకటయ్యారు.

జెమినీ గణేషన్

మొదటి భార్య ఉండగానే మహానటి సావిత్రిని రెండో వివాహం చేసుకున్నారు జెమినీ గణేషన్. వారిద్దరి మధ్య మనస్పర్థల నేపథ్యంలో తర్వాత మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని గణేషన్ అప్పట్లో రికార్డు కొట్టారు.

రాధిక

రాధిక ప్రముఖ దర్శకుడు ప్రతాప్ పోతన్ ను 1985లో వివాహం చేసుకుంది. ఆయనకు విడాకులు ఇచ్చిన తర్వాత రిచర్డ్ హార్డీని పెళ్లాడింది. ఆయనను కూడా విడిచిపెట్టిన రాధిక ప్రస్తుతం శరత్ కుమార్ తో ఉంటుంది. శరత్ కుమార్ కూడా ఛాయను పెళ్లి చేసుకొని 2000 సంవత్సరంలో విడాకులు ఇచ్చాడు. తర్వాత రాధికను మూడో పెళ్లి చేసుకున్నాడు. శరత్ కుమార్ కు రెండో భార్య రాధిక కాగా, రాధికకు మాత్రం శరత్ కుమార్ మూడో భర్త.

శరత్ బాబు

సీనియర్ నటుడు శరత్ కుమార్ తనకంటే పెద్ద వయస్సు ఉన్న రమాప్రభను వివాహం చేసుకున్నాడు. కానీ ఎక్కువ కాలం వీరు కలిసి ఉండలేదు. తర్వాత స్నేహలతా దీక్షిత్ ను వివాహం చేసుకున్నా ఇప్పుడు వాళ్లు కూడా కలిసి లేరు.

కిశోర్ కుమార్

స్టార్ హీరో కిషోర్ కుమార్ కూడా మధుబాలను రెండో వివాహం చేసుకున్నాడు. ఈయన కూడా తర్వాత రెండు పెళ్లిళ్లు చేసుకొని మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకొని రికార్డు సాధించారనే చెప్పాలి.

ధర్మేంద్ర

హేమా మాలినిని ధర్మేంద్ర రెండో వివాహం చేసుకున్నాడు. దీని కోసం ఆయన తన మతాన్ని కూడా మార్చుకున్నారట. హిందూ మతంలోకి వచ్చి మరీ హేమా మెడలో తాళి కట్టారు ధర్మేంద్ర

లక్ష్మి, జయంతి

సీనియర్ నటి లక్ష్మి కూడా ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఇక సీనియర్ నటి జయంతి కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత తనకన్నా 25 సంవత్సరాల చిన్నవాడైన ప్రముఖ దర్శకుడిని మూడో వివాహం చేసుకుంది.