ముస్లిం అయిన శ్రీహాన్.. హిందువుగా మారడానికి కారణం?

0
341

శ్రీహాన్ ఈ పేరు అప్పట్లో యూట్యూబ్ లో బాగా మారుమోగిన పేరు. బిగ్ బాస్ సీజన్ 6 తర్వాత బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. యూట్యూబర్ గా గుర్తింపు పొందిన శ్రీహాన్ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఆయనను బాగా పాపులర్ చేసిన షార్ట్ ఫిలిం ‘సాఫ్ట్‌వేర్ బిచ్చగాళ్లు’. బిగ్ బాస్ సీజన్ 5లో హౌజ్ లో ఉన్న సిరి లవర్ గా కూడా ఆయన చాలా మందికి తెలుసు.

ఆ సీజన్లో బయట నుంచి సిరికి సపోర్ట్ చేస్తూ ఓటింగ్ లో ఆమెకు సహాయం చేశారు. ఇక సీజన్ 6 వచ్చే సరికి శ్రీహాన్ హౌజ్ లో ఉండగా సిరి బయటి నుంచి ఓట్లు వేయించింది. ఫ్యామిలీ వీక్ లో శ్రీహాన్ ను కలిసేందుకు వచ్చిన సిరి శ్రీసత్యకు వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్లింది. నిజానికి సీజన్ 6 విన్నర్ శ్రీహానే కానీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నాగార్జున ఇచ్చిన డబ్బులు తీసుకొని రన్నర్ గా ఉన్నాడు.

నేవీకి రిజైన్ చేసి

శ్రీహాన్ కు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. సీజన్ 6లో సిరితో వచ్చింది కూడా ఆయన అన్న కొడుకే. శ్రీహాన్ ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. యూట్యూబర్ కాక ముందు శ్రీహాన్ నేవీ ఆఫీసర్ గా ఉండేవాడట. ఇండియన్ నేవీలో మూడేళ్లు పని చేశారట. కానీ ఇండస్ర్టీలోకి వెళ్లాలనే కోరికతో ఆ జాబ్ కు రిజైన్ చేసి వచ్చారట. తర్వాత యూట్యూబర్ గా రాణిస్తూనే సీజన్ 6లోకి ఎంటరయ్యారు.

అసలు విన్నర్ శ్రీహానే..!

కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన శ్రీహాన్ చాలా జాగ్రత్తగా గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. ఏ సందర్భంలో కానీ తనపై నెగెటివ్ ఇంపాక్ట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. ఆయన ఆట తీరును మెచ్చిన చాలా మంది ఫ్యాన్స్ గా మారడంతో పాటు ఓట్ల వర్షం కురిపించి చివరి వరకూ తీసుకువచ్చారు. చివరి ఎపీసోడ్ లో విన్నర్ గా నిలుచుంటావా లేదా డబ్బులతో వెళతావా అని నాగార్జున క్వశ్చన్ కు ఆయన డబ్బులనే ఎంచుకున్నాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన తండ్రి చెప్పిన మాట ప్రకారం రూ. 40 లక్షలు తీసుకొని రన్నర్ గా నిలిచారు.

ఆయన ముస్లిం కుటుంబానికి చెందిన వారా..?

హౌజ్ లో కొనసాగుతన్న సమయంలో గాసిప్ లు, వార్తలు రావడం కామనే అయినా బయటకు వచ్చిన తర్వాత కూడా వార్తల్లో నిలుస్తున్నారు శ్రీహాన్. అందేంటంటే శ్రీహాన్ హిందువు కాదట. మరి ఆయన పేరు హిందువులు పెట్టుకునే మాదిరిగానే ఉంది. ఆయనది ఒక ముస్లిం కుటుంబం అట. ఇక్కడ ఇండస్ర్టీలో రాణించాలంటే పేరు మార్చుకోక తప్పదని శ్రీహాన్ గా పెట్టుకున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కానీ దీనిపై ఇప్పటి వరకూ శ్రీహాన్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.