పెళ్లిపై అనుష్క శెట్టి అఫీషియల్ ప్రకటన..!

0
408

టాలీవుడ్ ఇండస్ర్టీతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో అనుష్క శెట్టికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి 7 నవంబర్, 1981లో జన్మించిన ఆమె నటి, మోడల్. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ర్టీలో కలిసి దాదాపు 47 చిత్రాల్లో నటించింది కన్నడ ముద్దుగుమ్మ. ఆమె నటించిన కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘అరుంధతి’లో నటించి ఇండస్ర్టీని ఒక్కసారిగా షేక్ చేసింది. దర్శకు ధీరుడు రాజమౌళి చేతికి చిక్కిన అనుష్క బాహుబలిలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇప్పటి వరకూ మూడు ఫలింఫేర్ అవార్డ్ సౌత్, రెండు నంది, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను దక్కించుకుంది.

పెళ్లి పీటలు ఎక్కబోతున్ కన్నడ భామ

టాలీవుడ్ ఇండస్ర్టీలో నాగార్జునకు జోడీగా సూపర్ తో అరంగేట్రం చేసిన అనుష్కకు తర్వాత వరుప పెట్టి ప్రాజెక్టులు రావడం మొదలు పెట్టాయి. చూడచక్కని అందం. మంచి హైట్ తో ఉన్న ఈమె పక్కన చేసేందుకు హీరోలు కూడా ఉత్సాహం చూపించేవారంటే అతిశయోక్తి కాదు. ‘వేదం’ సినిమాలో అనుష్క రోల్ కు మంచి గుర్తింపే వచ్చింది. అందులో వేశ్య పాత్రకు గానూ ఆమె ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. తెలుగు చిత్ర సీమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. ఫీమేల్ లో చూస్తే అనుష్క శెట్టి ఉంటుంది.

మంచి ఫ్రెండ్స్ మాత్రమే

వీరిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి ప్రపంచ సినీ ఇండస్ర్టీపై ఒక ముద్ర వేసిందనే చెప్పాలి. ఇద్దరూ కలిసి ‘మిర్చి’లో కూడా నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు శికారు చేయడం మొదలయ్యాయి. కానీ అవి నిజం కాదని, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ మీడియా ముఖంగా వివరించారు కూడా. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియదు కానీ. అనుష్క శెట్టి మాత్రం పెళ్లి పీటలు ఎక్కబోతునట్లు వార్తలు అటు కన్నడ, ఇటు తెలుగు ఇండస్ర్టీలో మాత్రం మారుమోగుతున్నాయి. అనుష్క పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సారి ఆమె తల్లిదండ్రులే చెప్పారంటూ కూడా మీడియాకు లీక్ అందింది.

ఇక అనౌన్సే మిగిలింది

సంప్రదాయాలకు చాలా విలువ ఇస్తుంది అనుష్క శెట్టి. తన స్వగ్రామం మంగళూరులో జరిగిన భూతకోలా వేడుకల్లో అనుష్క పాల్గొంది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని, అందుకే ఆమె మొక్కులు చెల్లించుకునేందుకు భూతకోలాలో పాల్గొందని, త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోందని అఫీషియల్ గా తెలుస్తోంది. ఆమెను పెళ్లి చేసుకునే వ్యక్తి గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలోని ఓ ఫేమస్ నగల వ్యాపారిని స్వీటీ పెళ్లి చేసుకోబోతోందట. ఇప్పటికే ఇరు వైపులా కుటుంబ సభ్యుల చర్చలు కూడా పూర్తయ్యాయట. మంచి ముహూర్తం నిర్ణయించి తర్వాత అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికైనా అనుష్క పెళ్లి పీటలు ఎక్కుతుందన్న వార్త విన్న ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారనే చెప్పాలి.