బిగ్ బాస్ హౌజ్ లో ఊహించని ట్విస్ట్

0
283

ప్రతి వారం ఏదో ఒక హైప్ ను క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా సోమవారం నామినేషన్ సెషన్ ముగిసింది. హౌస్ సభ్యులు కేప్టెన్ గా రేవంత్ ను ఎన్నుకోగా బిగ్ బాస్ అడ్డు చెప్పాడు. అతన్ని నామినేట్ చేయద్దని సూచించాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నామినేషన్ రహస్యంగా కొనసాగింది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూంలో ఇద్దరు సభ్యులను ఎంచుకోవాలని బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేశాడు. ఇందులో శ్రీహాన్ కు మెజారిటీ వ్యతిరేక ఓట్లు వచ్చాయి. ఇందులో కీర్తి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనలేదు.

ప్రతి సారీ అతడే మెజారిటీ ఓట్లు

రేవంత్ ను పక్కన బెట్టిన బిగ్ బాస్ కీర్తి కూడా నామినేషన్ వేయకపోవడంతో ఇద్దరినీ మినహాయించి శ్రీహాన్, రోహిత్, ఫైమా, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇయానా, రాజ్ నామినేట్ అయ్యారు. రేవంత్ ఎలిమినేషన్ అవుతాడు అనుకుంటున్న ప్రతి సారీ అతడే మెజారిటీ ఓట్లు దక్కించుకుంటూ టాప్ లో నిలుస్తున్నాడు. ఇక లేడీ కంటెస్టెంట్ ఇనయా నుంచి రేవంత్ కు గట్టి పోటీ ఉంది. ఈ వారం రేవంత్ నామినేషన్స్ ఉండదని ఇనయా టాప్ లో ఉంటారని బిగ్ బాస్ హౌజ్ చెప్పకనే చెప్తుంది.

ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్

తర్వాతి స్థానాల్లో వరుసగా ఆదిరెడ్డి, మూడో స్థానంలో రోహిత్, నాలుగులో శ్రీహాన్, ఐదో స్థానంలో రాజ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫైమా ఆరో స్థానానికి పరిమితం కానుండగా, ఏడో స్థానంలో శ్రీసత్య ఉంది. ఇదే కొనసాగితే శ్రీసత్య ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వారం షో ఎమోషనల్, ఎఫెక్టివ్ గా సాగనుంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ ను కలిసేందుకు వారి వారి కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తున్నారు. ఆదిరెడ్డి సతీమణి కవిత, కూతురు హద్వితతో ఎంట్రీ ఇచ్చింది.

రేవంత్ కన్నీరు కార్చాడు

కూతురి బర్త్ డే కు ఆదిరెడ్డి లేకపోవడంతో కేక్ తెప్పించి హౌజ్ సభ్యులతో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు ఆదిరెడ్డి. కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చి దాదాపు మూడు నెలలు ముగిసింది. హోమ్ సిక్ తో ఉన్న వారికి ఊరట కలిగించేందుకు బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ నిర్వహిస్తున్నాడు. ఈ ఫ్యామిలీ వీక్ తో కంటెస్టెంట్స్ కు మంచి ఎనర్జీ దొరుకుతుందని అంటున్నారు హౌజ్ మేట్స్. అయితే గర్భవతి అయిన తన భార్యను తలుచుకొని రేవంత్ కన్నీరు కార్చాడు.

బిగ్ బాస్ గేమ్ చేంజర్ గా

ఈ ఓటింగ్ ప్రక్రియలో టాప్ కంటెస్టెంట్లుగా చెప్పుకున్న వారు ఇంటి దారి పట్టాల్సి వస్తుందని న్యూస్ వైరల్ కావడంతో బిగ్ బాస్ మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకోవడంతో అగ్రస్థానంలో నిలిచేందుకు హౌజ్ మేట్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఊహించిన వారే కాకుండా ఊహించని వారు ఎలిమినేట్ అవుతారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ గేమ్ చేంజర్ గా మారి ఎవరిని హౌజ్ నుంచి బయటకు పంపిస్తాడు అంటూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరిన్ని ఎపీసోడ్లలో కేప్టెన్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు. వేయిట్ అండ్ సీ అంటున్నాడు బిగ్ బాస్.