యంగ్ స్టార్స్ హీరో, హీరోయిన్ వివాహం..!

0
265

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కనిపించారు. వీరి మధ్య డేటింగ్ కొనసాగుతుందని కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తుండగా, వీరి వివాహానికి సంబంధించి ఫ్యాన్ మేడ్ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో బాగా దూసుకుపోతున్న స్టార్. ఈయన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా యంగ్ హీరో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక రష్మికా మందన విషయానికి వస్తే టాలెంటెడ్ హీరోయిన్లనో మొదటి వరుసలో ఉన్నారామె.

విజయ్, రష్మికా కాంబోలో ‘గీత గోవిందం’

‘పుష్ప’లో ఆమె నటనకు ఫిదా అయిపోయారు అభిమానులు. ‘సీతా రామం’లో కూడా ఆమె కీ రోల్ ప్లే చేశారు. కథ డిమాండ్ చేస్తే అతిథి పాత్ర చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటుంది రష్మిక మందన. విజయ్, రష్మికా కాంబోలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వచ్చాయి. ఈ రెండు మూవీల్లో వీరి కెమిస్ర్టీ బాగా కుదిరింది. అందుకే ఇవి బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి. రొమాన్స్ లోనూ వీరు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆన్ స్ర్కీన్ కాదు ఆఫ్ స్ర్కీన్ పై వీరి రొమాన్స్ కొనసాగుతుందని అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి. వీరు లవ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో గాసిప్ వెంటాడుతూనే ఉన్నాయి.

బెంగళూర్ లోని ఓ రెస్టారెంట్ లో

వీరు గతంలో బెంగళూర్ లోని ఓ రెస్టారెంట్ లో కనిపించిన ఫొటోలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. విజయ్ కుటుంబ సభ్యులతో రష్మిక క్లోజ్ గా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఇద్దరూ కలిసి మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు రీసెంట్ వీరు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ నటించిన ‘బేబీ’ టీజర్ ను లాంచ్ చేశారు.

ఇప్పటి వరకూ ఖండించలేదు

ఇదిలా ఉంటే వీరిపై వస్తున్న రూమర్స్ ను విజయ్ కానీ, రష్మిక కానీ ఇప్పటి వరకూ ఖండించలేదు. మంచి స్నేహితులమనే చెప్పుకస్తున్నారు. మంచి స్నేహితుల మధ్యనే లవ్ పుడుతుందని కామెంట్లు సైతం గుప్పిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వధూవరుల వేషంలో విజయ్-రష్మిక ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనికి విజయ్ దేవరకొండ అభిమాని ఒకరు క్రియేట్ చేసి నెట్టింట్లో వదిలాడు. ఫ్యాన్ చేసిన పనికి హీరో హీరోయిన్ ఇబ్బంది పడ్డా.. ఇది ఫ్యూచర్ లో నిజం అవుతుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

ఆంతర్యం తెలియకనే తెలుపుతుందని కామెంట్లు

‘బేబీ’ టీజర్ పై ఇద్దరూ ఒకే సారి స్పందించడంతో కొంత ఆసక్తి నెలకొంది. విజయ్ తమ్ముడి మూవీకి రష్మిక స్పందించడంలో ఆంతర్యం తెలియకనే తెలుపుతుందని కామెంట్లు సైతం వచ్చాయి. లైగర్ పరాభవంతో ఉన్న విజయ్ ‘ఖుసీ(2022)’తో అయినా సక్సెస్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక రష్మిక విషయానికి వస్తే ‘పుష్ప’ పాన్ ఇండియా లెవల్ లో సంచలనం సృష్టించగా, ‘పుష్ప2’ షూటింలో ఉంది మందన.