ప్రభాస్ ‘సలార్’ మూవీ మొట్టమొదటి రివ్యూ

0
415
salar movie review

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ రేపు ప్రపంచవ్యాప్తగా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసిన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్స్ కోసం జనాలు యుద్దాలు చేసే పరిస్థితి ఏర్పడింది.

మొదటి రోజు రికార్డులు ఏ స్థాయిలో ఉంటుందో అని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఆ స్థాయిలో ఉన్నాయి మరి అడ్వాన్స్ బుకింగ్స్. ఇదంతా పక్కన పెడితే ఏ సినిమాకి అయినా ముందుగా దుబాయి లో కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకమైన ప్రీమియర్ షో ని విడుదలకు ముందు వెయ్యడం అనేది ఆనవాయితీగా వస్తునే ఉంది.

salaar review

‘సలార్’ కి సంబంధించిన ప్రీమియర్ షో ని కూడా కాసేపటి క్రితమే వేశారు. ఈ ప్రీమియర్ షో నుండి వచ్చిన రెస్పాన్స్ రేపు థియేటర్స్ లో చూడబోయ్యే ఆడియన్స్ నుండి కూడా వస్తే సినిమా వసూళ్లు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.

సినిమా ప్రారంభం నుండే మంచి న్యారేషన్ తో ప్రారంభిస్తాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఎంట్రీ కి ముందే స్టోరీ లోకి ప్రతీ ఒక్కరినీ ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాడట. ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ నుండి సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని టాక్. యాక్షన్ సన్నివేశాలు ఇది వరకు ఎవ్వరూ చూడని విధంగా ఉంటాయట.

అలాగే ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేసాడట డైరెక్టర్. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా సీట్ మీద నుండి పైకి లేచి విజిల్స్ వేసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడట.

ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన రిపోర్ట్ ఇలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సన్నివేశం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని రేంజ్ లో ఉంటుందట. ప్రాణ స్నేహితులు గా ఉన్న ప్రభాస్ మరియు పృథ్వీ రాజ్ భద్ర శత్రువులుగా ఎందుకు మారారు?

అసలు క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలో కలిగిస్తుందట ఈ మూవీ. క్లైమాక్స్ లో వచ్చే సర్ప్రైజ్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అని, అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ చిత్రం రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.