ఏమిటి హనుమాన్‌ ఈ కలెక్షన్‌ల ఊచకోత!

0
273
What Hanuman is the massacre of these collections
What Hanuman is the massacre of these collections

2024 సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాల్లోనూ బడ్జెట్‌ పరంగా చూసినా, కాస్టింగ్‌ పరంగా చూసినా చిన్న సినిమా ‘హనుమాన్‌’. ప్రశాంత వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సూపర్‌ హీరో చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది.

ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జాల కాంబోలో ఇంతకు ముందు ‘జాంబిరెడ్డి’ చిత్రం వచ్చింది. అది కూడా మంచి విజయం సాధించింది.

సంక్రాంతి బరిలోకి వచ్చిన ఈ చిత్రానికి థియేటర్స్‌ సమస్య ఏర్పడిరది. ఆల్రెడీ మహేష్‌, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్స్‌ నటించిన భారీ చిత్రాలు విడుదల అవుతుండడంతో ఈ సినిమాకు థియేటర్స్‌ దొరకని పరిస్థితి. ఇదే పెద్ద వివాదంగా మారింది.

ఈ విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌రాజు ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

అయినప్పటికీ వెనకడుగు వేయకుండా హను`మాన్‌ సంక్రాంతి బరిలోకి దూకింది. మొదటి ఆట నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ను స్వంతం చేసుకుంది.

మరోవైపు మహేష్‌ నటించిన గుంటూరు కారం ఆశించిన టాక్‌ రాకపోవడం, వెంకీ నటించిన సైంధవ్‌ సైతం అంతగా టాక్‌ తెచ్చుకోక పోవడంతో హనుమాన్‌ దూకుడుకు అడ్డు లేకుండా పోయింది.

Mahesh Trivikrams combination closed the career of two producers

హనుమంతుని బ్యాక్‌డ్రాప్‌లో కథ కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు, పాన్‌ ఇండియా లెవల్‌లో కూడా కలెక్షన్‌లు దున్నేస్తోంది.

హిందీ వెర్షన్‌ తొలిరోజు 2.15 కోట్లు వసూలు చేస్తే, రెండోరోజుకు 4 కోట్లకు, 3 రోజు 6 కోట్లకు చేరడం బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.

ఈనెల 25 వరకూ బాలీవుడ్‌లో పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడంతో ఒక్క బాలీవుడ్‌లోనే ఇది 40 కోట్ల మార్క్‌ను చేరేలా ఉంది.

ఇక ఓవర్‌సీస్‌లోనూ హనుమాన్‌ తన ర్యాంపేజీని కంటిన్యూ చేస్తున్నాడు. తొలి మూడు రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్‌ రాబడుతూ పాత రికార్డులను బ్రేక్‌ చేస్తున్నాడు.

నార్త్‌ అమెరికాలో అయితే ఏకంగా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కాంతారా, కేజీఎఫ్‌ రికార్డులను తుడిచిపెట్టేలా పరుగు పెడుతోంది.

ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడం కేవలం మౌత్‌ టాక్‌ వల్లే కావడం ట్రేడ్‌ పండితులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

విడుదలకు ముందు రేగిన థియేటర్స్‌ వివాదం ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీని కావాల్సినంత తెచ్చిపెట్టిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి.