అత్తింటి విషయాలు బయటపెట్టిన నిహారిక

0
1872

మెగా డాక్టర్ నిహారిక కొంచెం పరిచయం అవసరమయ్యేలా ఉంది. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నాహారిక. ఆమె కొన్ని సినిమాలలో మాత్రమే నటించారు. అవి కూడా ఎక్కువగా ఆడలేదు. కానీ ఆమెకు అభిమానులు మాత్రం ఎక్కువే అని సత్యం మాత్రం చెప్పి తీరాల్సిందే. ఆమె వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెరపై చాలా షోలలో కనిపించింది. ఇందులో హోస్ట్ గానో కాదండోయ్.. జస్ట్ గెస్ట్ గా మాత్రమే అప్పుడప్పుడు తన తండ్రి నాగబాబుతో కలిసి కనిపించేది. చాలా క్యూట్ గా అప్పుడప్పుడూ షోలలోని కంటెస్టెంట్స్ తో హార్ష్ ఉండేది కూడా.

ప్రిన్సెస్ లా పెరిగాను

నాగబాబు కుటుంబంలో నిహారిక ప్రిన్సెస్. ఆయనకు ఒక కొడుకు, ఒక బిడ్డ కాగా నిహారిక చిన్నది. వరుణ్ తేజ్ పెద్దవాడు. చిన్నప్పటి నుంచి నిహారికను కుటుంబ సభ్యులు చాలా గారాబంగా చూసుకునేవారు. ఆమె ఎంతంటే అంతే వారి కుటుంబంలో, అయితే నిహారికా కూడా చాలా క్రమశిక్షణగా ఉండేది. పెద్దన్నయ్య రాం చరణ్, తన అన్న వరుణ్ తేజ్ తో సందడిగా గడిపేది. ఆమెకు ఈ మధ్యనే వివాహం కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె అత్తగారింట్లో ఉంటోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పుట్టింటిని, అత్తింటిని కంపేర్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పింది. ఇప్పుడు అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అత్తగారింట్లో కూడా అంతే

సాధారణంగా ప్రతి ఇంట్లో కూతురే ప్రిన్సెస్. నేను కూడా మాంట్లో యువరాణినే. పెళ్లయినా కూడా అత్తింట్లో కూడా ఇప్పుడు అలానే ఉంటున్నానని చెప్పింది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో నేను ఎక్కువగా ఆలోచించలేదు. కానీ బాగుంది అంటుంది. అత్తమ్మ, మామయ్యా చాలా మంచి వారు. వారు కూడా నన్ను కూతురిలా చూసుకుంటున్నారు. అత్తమ్మా ఆకలవుతుంది అంటే ఆమే కలిపి తినిపిస్తున్నారు. నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటారు. అత్తా, మామలు ఎక్కువగా ఏం చెప్తారంటే మేము నిన్న బాగా చూసుకుంటాం నువ్వు చైతన్య (నిహారిక భర్త)ను బాగా చూసుకో చాలు అంతే అంటారు.

మా అత్తమ్మ కాళ్లు మొక్కాలి

ఇక నేను మా ఇంట్లో ఉదయం 10 గంటల వరకూ పడుకుంటాను. మా అమ్మే వచ్చి తలుపుతట్టి నిద్రలేపుతుంది. ఇక్కడ మా అత్తమ్మ తలుపు కూడా తట్టదు. అత్తింట్లో ఇంకా బాగుందని చెప్పింది. ఈ విషయంలో మా అత్తమ్మ కాళ్లు మొక్కాలి అంటూ చేతులు జోడించి మీరీ చెప్పింది నిహారిక. మా పుట్టింట్లో ఎప్పుడు ఊరికి వెళ్లాలని నాన్నను అడిగినా నీ పెళ్లియిన తర్వాత భర్తతో వెళ్లు అనే వారు. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎక్కువగా ట్రావెలింగ్ కే సమయం కేటాయిస్తున్నాను అని చెప్పింది.

నిర్మాతగా రాణిస్తున్న నిహారిక

నటిగా కలిసి రాకపోవడంతో నిహారిక నిర్మాతగా మారారు. సొంత బ్యానర్ ఒకటి పెట్టి దాన్నుంచి వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. నటిగా రాణించకపోయినా నిర్మాతగా సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.