బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ టాప్ డైరెక్టర్ తో సినిమాకు ఒకే

0
277

యువరత్న నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ తో పాటు ఓటీటీని కూడా దున్నేస్తున్నాడు. ‘వీరహింహారెడ్డి’ షూటింగ్ చేస్తూనే ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ సెకండ్ సీజన్ ను దుమ్మురేపుతున్నారు. స్టార్ హీరోలు, గ్రేట్ పొలిటీషియన్లతో ఆడుకుంటున్నారు బాలయ్య. బాలయ్యా మజాకా ఏది చేసినా ట్రెండ్ సెట్ చెయ్యడం ఆయనకే చెల్లింది. ఇక ఆయన ‘వీరసింహా రెడ్డి’కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. 12 జనవరి , 2023న సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్లు చిత్ర యూనిట్ తేదీని కూడా ప్రకటించింది.

‘ఎన్‌బీకే 108’కు ముహూర్తం

అయితే ఇటీవల బాలయ్య ఓ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఇప్పటికీ ఫెయిల్యూర్ ఎరగని టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు సై అన్నాడు బాలకృష్ణ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రారంభ ముహూర్తం డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. టైటిల్ ను కూడా ఇందులో ప్రకటించబోతున్నారట చిత్ర యూనిట్. సక్సెస్ లతో దూసుకుపోతున్న బాలకృష్ణ జోరుమీదున్నారు. ‘ఎన్‌బీకే108’ చిత్రం ప్రారంభమహూర్తాన్ని గురువారం (డిసెంబర్ 8)న డిసైడ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ వివరాలను బుధవారం మీడియాకు వివరించింది.

షూటింగ్ కూడా ప్రారంభం

గురువారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం షాట్ ఉంటుందని చెప్పింది. రెగ్యులర్ షూటింగ్ కూడా గురువారం నుంచే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీని కోసం భారీ సెట్ కూడా వేసినట్లు సమాచారం. టైటిల్ ను కూడా ప్రకటించబోతున్నారట. ఈ సినిమాకు ‘రామారావు గారు’ అనే టైటిల్ ఉండబోతోందని చిత్ర వర్గాలు లీక్ చేశాయి. గారపాటి సాహు, హరీశ్ ‘షైన్ స్ర్కీన్ పతాకం’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలయ్య ఇటీవలి చిత్రం ‘అఖండ’ బాక్సాఫీస్ హిట్ తో భారీగా రూ. 150 కోట్లు కలెక్షన్ చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరింత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మూవీ వర్గాలు తెలిపాయి.

కొత్తగా తెరకెక్కించనున్న అనిల్ రావిపూడి

అఖండ హిట్ తో బాలకృష్ణకు మార్కెట్ ఓపెన్ కావడం, ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతుండడంతో భారీగా ఖర్చు చేసేందుకు నిర్మాతలు సైతం ఆసక్తి చూపుతున్నారట. ఈ మూవీకి రూ. 90 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని డైరెక్టర్ అనిల్ రావిపూడి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీస్తున్నారట. బాల్య బాబు కోసమే ఆయన ఒక కథను కూడా సిద్ధం చేసుకున్నారట. ఇప్పటి వరకూ ఎంటర్ టైనర్ జోనర్ లో సాగే అనిల్ రావి పూడి సినిమాలు ఈ సినిమాతో మారనుందని తెలుస్తోంది.

గతంలో చూసిన బాలయ్య

ఇందులో బాలయ్య పాత్ర కొత్తగా ఉంటుందని, గతంలో చూసిన బాలయ్యను ఈ చిత్రంలో చూడలేరని చెప్తున్నారు యూనిట్ సభ్యులు. ఈ మూవీకి కూడా వీరసింహారెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పెళ్లి సంద‘డీ’ హీరోయిన్ శ్రీలీల ఇందులో కీరోల్ పోషిస్తుందని చెప్పారు. సి రాంప్రసాద్ సినిమాటో గ్రాఫర్ కాగా, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్, ఫైట్ మాస్టర్ గా వెంకట్ వ్యవహరించనున్నారు. ఇక బాలకృష్ణకు జోడీగా ప్రయాంకా జవాల్కర్ నటించనుండగా, ప్రియమణి కూడా ఆయనతో కనిపించబోతోందని తెలుస్తోంది. నెగెటివ్ షేడ్ పాత్రలో అంజలి నటించనుందట.