సీఎంగా బాలకృష్ణ..! ఆనందంలో నందమూరి ఫ్యాన్స్..!

0
1333

సినీరంగం రాజకీయం పెనవేసుకునే ఉంటాయి. ఎంతో మంది స్టార్లు ఎన్నో ఇండస్ర్టీల నుంచి పార్టీలు పెట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మన్ననలు కూడా పొందరు. ఇంకొందరు సీఎంలుగా కొనసాగిన వారున్నారు. తమిళంలో ఎంజీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకచ్చి తమిళులకు ఎన్నో సేవలు చేశారు. ఆయన ఇన్పిరేషన్ తోనే అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి తెచ్చి తెలుగు రాష్ర్టాలను ఏలారు. ఆయన హయాంలోనే చాలా అభివృద్ధి జరిగిందని ఆ ఫలాలు ఇప్పటికి కూడా ప్రజలు పొందుతున్నారడంలో సందేహం లేదు.

కొనసాగనున్న రాజకీయ వారసత్వం..!

నందమూరి తారక రామారావు దాదాపు సీఎంగా వెళ్తున్న సమయంలోనే యువరత్న నందమూరి బాలయ్య బాబు ఇండస్ర్టీకి వచ్చారు. తండ్రి నుంచి నట వారసత్వాన్ని పునికి పెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల నోళ్లు మూయించాడు. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ తర్వాత బాలయ్య బాబే అనే ఛరిష్మాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

తండ్రి నట వారసత్వంతో పాటు రాజకీయ వారసత్వం కూడా తీసుకున్నాడు బలకృష్ణ. తను నటనలో బిజీగా ఉంటేనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గానికి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తన బావ నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా ఉండగా ఆయనతో కలిసి పార్టీకి సేవలు చేస్తున్నారు బాలయ్య బాబు.

పరశురాం కథకు గ్రీన్ సగ్నల్..!

‘అఖండ’ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న బాలకృష్ణ సంక్రాంతికి మరో సింహాంతో రాబోతున్నారు. ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా తన అభిమానుల కోసం జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు కొంచెం గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాడట. అదేనండీ సినిమాకీ సినిమాకీ మధ్య కాస్తంత విరామం. అయితే ఇంతలో ఆయనను న్యూ యంగ్ డైరెక్టర్ పరశురాం కలిశాడట.

ఆయన చెప్పిన కథ బాలయ్య బాబుకు బాగా కనెక్ట్ అయ్యిందని, త్వరలో వీరి కాంబోలో ఓ ఫిలిం తెరకెక్కబోతున్నట్లు ఇండస్ర్టీ ఇప్పుడు చెప్పుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్య బాబు సీఎంగా కనిపించబోతున్నారంటూ కూడా వార్తలు చెక్కర్లు కొడుతున్నారు.

సీఎంగా కనిపించనున్న బాలయ్య

‘వీరసింహారెడ్డి’ రిలీజ్ తేదీ ఇప్పటికే ప్రకటించగా ప్రమోషన్ కోసం మైత్రీ మూవీ మేకర్స్, చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో యంగ్ డైరెక్టర్ పరశురాం కథకు బాలయ్య ఓకే చెప్పడంతో ఈ సినిమాకు సంబంధించి పనులు వేగం పుంజుకోబోతున్నాయని చిత్ర వర్గాలు టాక్ మొదలైంది. పరశురాం చిత్రంలో బాటయ్య సీఎం (CM Balakrishna) గా కనిపించబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు ఇండస్ర్టీలో హాట్ టాక్ గా మారింది.

ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే బాలకృష్ణ ఇప్పటి వరకూ చేయని పాత్రతో సీఎంగా కనిపిస్తారంటూ టాలీవుడ్ లో విపరీతమైన టాక్ నడుస్తోంది. ఈ విషయం నందమూరి అభిమానులు కూడా బాగా నచ్చిందట, ఈ లీక్ కు వారు స్పందిస్తూ తాము కూడా బాలయ్య బాబును సీఎంగా చూడాలని అనుకుంటున్నామని, ఇలాంటి కథతో చిత్రం వస్తే మా కల నెరవేరుతుందని కామెంట్లు పెడుతున్నారు.