మొదటి వారానికే కథ కంచికి..

0
1960

భీమ్లా నాయక్.. విడుదల అయిన మొదటి రోజు ప్రీ బుకింగ్ కలెక్షన్ లు తప్పితే.. ఎక్కడా కూడా కలెక్షన్ ల ప్రభావం చూపించలేక పోయింది. మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణలలో కలిపి మొత్తం 26 కోట్లు వసూళ్లు చేయడంతో అంతా సినిమా హిట్ అవుతుందని భావించారు. అయితే ఆ తరువాత అభిమానులకు తప్పితే ఎవరికీ నచ్చలేదు. సినిమాపై నెగిటివ్ మౌత్ టాక్ బాగా వెళ్లడంతో సగటు ప్రేక్షకుడు థియేటర్ మొహం కూడా చూడలేదు. మధ్యలో శివరాత్రి ఉండడంతో కొద్దిగా కోలుకున్నట్లు కనిపించినా.. మళ్ళీ కథ మాములే.

కోట్లలో నుండి లక్షల్లోకి కలెక్షన్ లు

చివరికి విడుదలైన మొదటి వారం చివరికే ఆంధ్ర, తెలంగాణలలో కోట్లలో నుండి లక్షల్లోకి కలెక్షన్ లు పొడిపోయాయి. ఏడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కేవలం 98 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే 20 కోట్లు వసూళ్లు చేయాలి. అది అసాధ్యమే అని చెప్పవచ్చు. దీనితో ఈ చిత్రం ప్లాప్ గా నిలువనుంది. అంతే కాక వచ్చే వారం నుండి పెద్ద సినిమాలు వస్తుండడంతో సగటు ప్రేక్షకుడు ఈ సినిమా చూడడం ఇష్టపడం లేదు.

భారీ సినిమాలకోసం అభిమానులు ఎదుచూపు

ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యాం చిత్రం ఈ నెల 11 న విడుదల కానుంది. ఎప్పటి నుండో టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఎదుచూస్తున్న రాజమౌళి చిత్రం RRR చిత్రం కూడా మార్చి 25 న విడుదల కానుంది. కేజీఎఫ్ 2 చిత్ర ట్రైలర్ ఈ నెల 27న రానుండగా.. చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలోకి రాబోతోంది. రాకీ భాయ్ సినిమా కోసం ఎప్పటి నుండో దేశ వ్యాప్తంగా ఎదుచూస్తున్నారు.

భీమ్లా నాయక్ కలెక్షన్ లు కు గండి

ఇండియన్ హిస్టరీలో హీరోయిజంని ఒక రేంజిలో చూపించిన సినిమాగా కేజీఎఫ్ ప్రశంసలు అందుకుంది. కేజీఎఫ్ 2 లో సంజయ్ దత్, రవీనా లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యం లో ప్రేక్షకులు అంతా ఆ పెద్ద సినిమాలకోసం డబ్బులు ఉంచుకుంటున్నట్లు కనిపిస్తుంది. అందుకే భీమ్లా నాయక్ కలెక్షన్ లు కు గండి పడుతుందని చెప్పవచ్చు.