‘ధూమ్ 4 ‘ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫ్యాన్స్ కి దిమ్మతిరిగిపోయే అప్డేట్!

0
194
Mega power star Ram Charan in Dhoom 4 An exciting update for fans

#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దేశం కానీ దేశాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

జపాన్ దేశం లో అయితే ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. అంతే కాకుండా జపాన్ ప్రాంతం లో రామ్ చరణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టేలా చేసింది.

కేవలం జపాన్ లో మాత్రమే కాదు, అమెరికన్ సిటిజెన్స్ లో కూడా రామ్ చరణ్ మామూలు క్రేజ్ ఏర్పడలేదు. అలాంటి రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలని ఏ ఇండియన్ డైరెక్టర్ కి ఉండదు చెప్పండి?..

అందుకే యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ త్వరలోనే రామ్ చరణ్ మరియు షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ‘ధూమ్ 4’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అని బాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

ఇండియా లో ధూమ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ లో ఈ సిరీస్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి మూడు సినిమాలు వచ్చాయి.

మొదటి సినిమాలో జాన్ అబ్రహం దొంగ క్యారక్టర్ చెయ్యగా, అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఇక రెండవ సినిమాలో మళ్ళీ అభిషేక్ బచ్చన్ పోలీస్ పాత్ర పోషించగా, హృతిక్ రోషన్ దొంగ పాత్ర చేసాడు.

Allu Arjun as the number 1 hero of 2023 Telugu made history

అలాగే మూడవ సినిమాలో అమీర్ ఖాన్ దొంగగా నటించాడు. ఇలా అన్నీ సినిమాల్లో దొంగలు మారుతూ వచ్చారు కానీ, పోలీస్ క్యారక్టర్ మాత్రం మారలేదు.

కానీ ధూమ్ 4 లో మాత్రం దొంగ పాత్రలో షారుఖ్ ఖాన్ నటిస్తే, పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నాడని టాక్. షారుఖ్ ఖాన్ పాత్రకి ఏమాత్రం తగ్గకుండా ఈ క్యారక్టర్ ని డిజైన్ చేసాడట డైరెక్టర్.

ఈ ఏడాది మధ్యలో కానీ చివర్లో కానీ ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచెయ్యబోతున్నారట యష్ రాజ్ సంస్థ.

చూడాలిమరి మిగతా సినిమాలు లాగానే ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి బాలీవుడ్ లో రామ్ చరణ్ రేంజ్ ని మరింత పెంచుతుందో లేదో అనేది.