కూతురి కోసం ఓ స్టార్ హీరో కెరీర్ నాశనం

0
271

శృతీ హసన్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నటిగా కాకుండా గాయనీగా కూడా ఈమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె ఎవరో కాదు విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు (మొదటి భార్యకు పుట్టిన). తన తండ్రి పేరును అడ్డుపెట్టుకొని కాకుండా సొంతంగా ప్రతిభ చూపుతూ ఇండస్ర్టీలో రాణిస్తుంది. కెరీర్ మొదట్లో ఆమెకు మంచి ప్రాజెక్టులు రాకపోవడంతో వెనుకబడింది. స్టార్ డమ్ కోసం చాలా కష్టపడింది.

పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆమెకు స్టార్ డమ్ దక్కింది. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ర్టీలో మంచి రికార్డులను సాధించింది. ఫలితంగా ఆమె కోసం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టడం మొదలు పెట్టారు.

ఆ ఒక్క సినిమాతో స్టార్ డమ్

గబ్బర్ సింగ్ కు ముందు వరకూ ఆమె ప్లాప్ హీరోయిన్ అని ఎవరూ ఆమెను తన చిత్రంలో పెట్టుకునేందుకు దర్శకులు, నిర్మాతలు పట్టించుకునే వారు కాదట. కానీ పవన్ కళ్యాణ్ సినిమాతో ఆమె కెరీర్ పరంగా దూసుకుపోయారు. తర్వాత మంచి ప్రాజెక్టులు చేసి స్టార్ డమ్ ను నిలుపుకుంటూ వస్తున్నారు శృతీ హాసన్. ఆమె పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇండస్ర్టీలో చాలా గాసిప్స్ వచ్చాయి. బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూ వస్తుందని టాక్ ఉంది.

ఈ నేపథ్యంలో ఇండస్ర్టీలో ఆమె ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపించిందట. ఈ విషయం కమల్ హాసన్ కు తెలియడంతో. ఆయన వారిని విడదీశారట. తర్వత ఆ స్టార్ హీరో కూడా ఇండస్ర్టీలో కనిపించకుండా పోయారు. దీంతో కమల్ హాసనే ఇలా చేశారంటూ గాసిప్స్ ఇండస్ర్టీలో ఇప్పటికీ ఉన్నాయి.

ప్రేమ వ్యవహారంపై కమల్ ఆగ్రహం..!

ఇండస్ర్టీకి వచ్చిన కొత్తలో శృతీ హాసన్ ఒక కోలివుడ్ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డారట. వీరు పీకల్లోతు ప్రేమలో పడ్డారన్నవార్త కమల్ హాసన్ చెవికి చేరిందట. దీంతో ఆయన కూతురును వారించాట. వారిని విడగొట్టే ప్రయత్నం కూడా చేశారంటూ టాక్ లీకైంది. ఆ హీరో మంచివాడు కాదని, అతనికి చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని చెప్పాడట. వాడుకొని వదిలేయడం ఆయన స్టయిల్ అంటూ చెప్పారట.

అలాంటి వాడితో ప్రేమలో పడడం ఏంటని ఆయన వారించాట. ఆయనతో దూరంగా ఉండాలంటూ కూతురును హెచ్చరించారట కమల్ హాసన్. దీంతో ఆమె కూడా సదరు స్టార్ హీరోకు దూరంగా ఉంటూ వచ్చారట.

హీరోతో శృతీ హాసన్ బ్రేకప్

తండ్రి మాటలను విన్న శృతీ హాసన్ ఆ హీరోతో బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ స్టార్ హీరో ఇండస్ర్టీలో కనిపించకుండా పోయారట. మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న ఆ హీరో పాత్రల కోసం ప్రొడ్యూసర్స్, దర్శకుల వద్దకు వెళ్లడం ప్రారంభించారట. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బ్రతిమిలాడుకునే వరకూ వచ్చారట. అయినా ఆయనకు ఎవరూ ఆఫర్లు ఇవ్వలేదంటా. ఆయన అభిమానులు మాత్రం దీనికంతటికీ శృతీ హాసన్, ఆమె తండ్రి కమల్ హాసనే కారణం అంటూ సోషల్ వేదికగా కామెంట్లు పెడుతున్నారట.