కీరవాణి ని దూరం పెట్టబోతున్న రాజమౌళి..? కారణం అదేనా!

0
181
Is that the reason why Rajamouli is going to keep Keeravani away

కొంతమంది టాప్ డైరెక్టర్స్ తమ టీం ని మార్చేందుకు అసలు ఇష్టపడరు. తమ మొదటి సినిమాకి ఎవరైతే పనిచేసారో,వాళ్లనే తమ కెరీర్ మొత్తం కొనసాగిస్తూ వస్తుంటారు.

అలా దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన #RRR వరకు తన సోదరుడు కీరవాణి ని కొనసాగిస్తూ వచ్చాడు.

బాహుబలి సిరీస్ తర్వాత కీరవాణి ఇక సినిమాలను ఆపేద్దాం అనుకున్నాడు. బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇది ప్రకటించి కన్నీళ్లు పెట్టుకుంటాడు.

అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ని మనం మిస్ అయిపోతున్నాం అనుకున్నాం. కానీ రాజమౌళి బ్రతిమిలాడికి ఒప్పించాడో ఏమో తెలియదు కానీ, కీరవాణి మళ్ళీ సినిమాల్లో కొనసాగడానికి ఒప్పుకున్నాడు.

అలా ఒప్పుకోవడం వల్లే నేడు ఆయన #RRR చిత్రానికి పని చేసే అవకాశం దక్కింది, ఆస్కార్ అవార్డుని మన తెలుగు జాతికి అంకితం అయ్యేలా చేసింది.

అయితే సినిమాల పరంగా ఇంత సుదీర్ఘ ప్రయాణం ని కలిసి చేసిన రాజమౌళి మరియు కీరవాణి ఇక విడిపోయే సమయం వచ్చేసిందా?.

త్వరలోనే మహేష్ బాబు తో రాజమౌళి చెయ్యబొయ్యే సినిమాకి కీరవాణి సంగీత దర్శకత్వం వహించట్లేదా అంటే అవుననే అంటున్నారు.

రాజమౌళి ఇప్పటి వరకు మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవ్వరూ చూడని ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ని మహేష్ బాబు తో చెయ్యబోతున్నాడు. కథ కథనం మొత్తం కొత్తగా ఉంటుందట.

సినిమాకి పనిచేసే యూనిట్ మొత్తం హాలీవుడ్ టెక్నిషియన్స్ ఉంటారట ఈసారి. ఇప్పటి వరకు రాజమౌళి తో కలిసి పనిచేసిన ఎవ్వరూ కూడా ఈ సినిమాకి పనిచెయ్యరట. అలాగే కీరవాణి కూడా అని అంటున్నారు.

Mahesh says lets hit hard

కొత్త రకం సౌండ్ మిక్సింగ్ ని ఈ చిత్రం ద్వారా మన ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం చెయ్యాలి అనేది రాజమౌళి ఆలోచన. అందుకే ఈసారి కీరవాణి ని తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

ఈ ఏడాది మధ్యలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించి, ఆ తర్వాత వర్క్ షాప్ ని మొదలు పెట్టబోతున్నారని, ఈ వర్క్ షాప్ దాదాపుగా ఆరు నెలలు ఉంటుందని టాక్.

ఈఏడాది చివరి లోపు షూటింగ్ ప్రారంభించాలని ఉన్నారు మేకర్స్, ఈ సినిమాకి దాదాపుగా 1500 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేయనున్నారట.