టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు, హారిక`హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.
శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడును గుంటూరులో భారీగా నిర్వహించారు. మహేష్‌బాబు సినిమాకు సంబంధించిన తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లో జరగడం ఇదే తొలిసారి.
అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ… నా సినిమాలకు సంబంధించినంత వరకూ రికార్డులు, కలెక్షన్స్, బిజినెస్‌ల గురించి నేను ఎప్పుడూ మాట్లాడను..
ఆలోచించను కూడా. నాన్నగారే ఈ విషయాల గురించి మాట్లాడుతుంటారు. ఈసారి ఆయన లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ, నాన్న, అన్నయ్య. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఇష్టమైన దర్శకుడు.
ఆయనతో పనిచేయడం నాకు ఎప్పటికీ కొత్త ఎక్స్‌పీరియన్సే. ఈ సినిమాలో కూడా కొత్త మహేష్‌ను చూస్తారు. నిర్మాత చినబాబు గారికి నచ్చిన హీరోను నేనే అవటం హ్యాపీగా ఉంది. తెలుగమ్మాయి శ్రీలీల పక్కన డాన్స్ చేయాలంటే తాట ఊడిపోతుంది’’ అంటూ ప్రసంగించారు.
మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది అంటే నాకే నమ్మకం కుదరడం లేదు. ఒక సినిమాకు 200 శాతం ఎఫర్ట్స్ పెట్టే హీరో మహేష్. అతడు, ఖలేజా సినిమాల టైంలో ఎలా ఉన్నారో..
ఇప్పటికీ అలాగే ఉన్నారు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్‌ను ఆకాశానికి ఎత్తేశారు. దీంతో అభిమానులు పొంగిపోయారు. అయితే మరో కోణంలో అభిమానులకు టెన్షన్‌గా ఉంది.
మహేష్`త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన గత రెండు చిత్రాలు ‘అతడు’, ‘ఖలేజా’లు నిర్మాతలకు లాస్ ప్రాజెక్ట్‌లుగానే మిగిలాయి. ‘అతడు’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా పెద్ద లాభాలు తెచ్చిపెట్టలేదు.
కానీ బుల్లితెరపై మాత్రం సూపర్‌డూపర్‌హిట్ అయింది. ఇప్పటికీ ఆ సినిమా ఎప్పుడు టీవీల్లో వచ్చినా టాప్ టీఆర్పీ రేటింగ్‌లు వస్తాయి. ఇక ఖలేజా సినిమా అయితే మహేష్‌కు మరో డిజాస్టర్ ఇచ్చింది.
ఈ సినిమా బయ్యర్లే కాదు.. నిర్మాత కూడా మునిగిపోయారు. ఇలా చూస్తే త్రివిక్రమ్ మహేష్‌కు హిట్ డైరెక్టర్ ఏమీ కాదు.
మరి ‘గుంటూరు కారం’తో నైనా బాక్సాఫీస్ వద్ద మహేష్‌కు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. కానీ.. బాబు మాత్రం ఈసారి గట్టిగా కొడతాం అంటున్నాడు చూద్దాం అంటూ అభిమానులు గుసగుసలాడు కుంటున్నారు.