‘ఇండియా’ కూటమి ముందడుగు…

0
169
India alliance is a step forward

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గద్దె దింపటానికి విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి అనేక ఆటుపోట్లు, అలకలు, బుజ్జగింపుల తర్వాత నెమ్మదిగా పట్టాలు ఎక్కుతోంది.

కూటమి ప్రారంభంలోనే పార్టీ మధ్య ఆధిపత్యపోరు పొడచూపింది. ప్రధాని అభ్యర్ధి ఎవరనేదానిపై తీవ్రమైన టెన్షన్‌ నెలకొంది. మొదట రాహుల్‌ గాంధీ ప్రధాని అనుకున్నప్పటికీ ఆయన దానిని సున్నితంగా తోసిపుచ్చారు.

ఆ తర్వాత మమతా బెనర్జీ సహా అనేకమంది పేర్లు తెరమీదికి వచ్చాయి. చివరికి ప్రధాని అంశాన్ని పక్కనపెట్టి ముందు ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలను ఓడిరచి తగిన మెజార్టీ సాధించాలని నిశ్చయానికి వచ్చారు.

తాజాగా త్వరలో రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ విషయంలో పంజాబ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవా, ఢల్లీి, గుజరాత్‌ రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో కాంగ్రె ఒక అవగాహనకు వచ్చింది.

మంగళవారం మహారాష్ట్రకు సంబంధించిన విషయంలో శివసేన(ఉద్దవ్‌ థాక్రే), కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య అవగాహన కుదిరింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌,

శివసేనలు చెరో 20 సీట్లలో పోటీకి దిగుతాయి. ఎన్సీపీకి 6 సీట్లను కేటాయించారు. మరో మిత్రపక్షమైన వంచిత్‌ బహుజన్‌ అగాధీ పార్టీ (ప్రకాష్‌ అంబేద్కర్‌కు చెందినది)కి రెండు సీట్లను కేటాయించారు.

Police no to that idol procession in Ayodhya

అలాగే బీహార్‌లో సైతం ఆర్జేడీ, జనతాదళ్‌(యు)లు చెరో 17 స్థానాల్లో పోటీ చేస్తాయి. కాంగ్రెస్‌కు ఇక్కడ 4 సీట్లు కేటాయించారు. సీపీఐకి 1 సీటు, సీపీఐ(ఎం.ఎల్‌)కు 2 సీట్లు కేటాయించారు.

ఢల్లీిలోకూడా సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు అయినట్లే. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కనున్నాయి. గుజరాత్‌, గోవాలో ఒక సీటు, హర్యాణాలో 4 సీట్లు కాంగ్రెస్‌ ఆప్‌కు వదలనుంది.

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 6 స్థానాలు ఆప్‌ కేటాయించనుంది. మొత్తానికి ఎక్కడికక్కడ మిత్ర పక్షాలతో ఉన్న సీట్ల పంచాయితీలను తెగ్గొట్టుకుంటూ కాంగ్రెస్‌ పార్టీ ఇండియా కూటమిని ముందుకు నడిపించడంలో కీలక పాత్రను పోషిస్తోంది.

ఇప్పటికే రెండు పర్యాయాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో దేశంలోని రాజకీయ పార్టీల్లో చిచ్చుపెట్టడం ద్వారా వాటిని విచ్ఛిన్నం చేసి,

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అది కభళిస్తోందనే విమర్శలు ఉన్నాయి. కావున ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దింపాలనేది ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుంది.