సునీతారెడ్డిని టార్గెట్‌ చేసిన జగన్‌ బ్యాచ్‌

0
231
Jagan Sunitha Reddy

సునీతారెడ్డి… వై.యస్‌. వివేకానంద కూతురిగా, వై.యస్‌. జగన్‌ చెల్లిగా అందరికీ సుపరిచితమే. డాక్టర్‌ వృత్తిలో ఉన్న ఈమె వై.యస్‌. వివేకానంద హత్యకు ముందు వరకూ మీడియాలో కనపడేవారు కాదు. ఈమె గురించి వార్తలు కూడా ఏవీ మీడియాలో వచ్చేవి కావు.

అయితే 2019 ఎన్నికలకు ముందు వై.యస్‌. వివేకానందరెడ్డి దారుణంగా హత్య గావించబడటం, ఆ హత్యను నీరు గార్చటానికి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నించడం, ఇది పసిగట్టిన సునీతారెడ్డి న్యాయం కోసం ఢల్లీి చుట్టూ తిరిగి కేసును సీబీఐకి అప్పగించేలా చేయడంతో దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కారు.

తన తండ్రి హత్య వెనుక ఉన్న దోషులను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమె సాగిస్తున్న అలుపెరుగని పోరాటంతో ఉక్కిరిబిక్కిరి అయిన దోషులు ఏకంగా వివేకానందరెడ్డి హత్య వెనుక సునీతారెడ్డి ఉన్నదని, కాసేపు, అల్లుడు రాజశేఖరరెడ్డి ఉన్నాడని కాసేపు, వివేక అక్రమ సంబంధాలే కారణమని మరోసారి.

Jagan Sunitha Reddy

జగన్‌కు బర్రెలక్క స్వీట్‌ వార్నింగ్‌!..

ఇలా వివిధ రకాలుగా కేసును పక్కన దోవ పట్టించటానికి ప్రయత్నించారు. అయినా సునీతారెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈరోజు సునీతారెడ్డి దంపతులపై వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు గతంలో చేసిన ఫిర్యాదుపై కేసును రిజిస్టర్‌ చేశారు.

వివేకానందరెడ్డి హత్య తర్వాత నుంచి ఈ కృష్ణారెడ్డి జగన్‌ బ్యాచ్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌పై కూడా గతంలో కేసులు నమోదు చేయడం ఇక్కడ గమనార్హం.

తాజాగా సునీతారెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న విచారణలో ఇంప్లీడ్‌ కావడం వివేకా నిందితుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. దీంతో ఎలాగైనా సునీత దంపతులను నిలువరించాలనే ఉద్దేశ్యంతో కృష్ణారెడ్డితో కేసును పెట్టించి, విచారణ పేరుతో వారిని ఇబ్బంది పెట్టాలని పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కడప జిల్లా ఎస్పీకి సునీతారెడ్డి విన్నవించుకోవడం అందరికీ తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు రాబట్టే కేసును నమోదు చేయడం జరిగిందని, లేకపోతే ముఖ్యమంత్రి సోదరిపై కేసును రిజిష్టర్‌ చేసే ధైర్యం పోలీసులకు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.