కేసీఆర్‌ను చెప్పిమరీ దెబ్బకొట్టిన జర్నలిస్ట్‌లు

0
236
kcr telangana media

జర్నలిస్ట్‌లు, రాజకీయ నాయకులూ ఇద్దరూ సమాజహితం కోసం పనిచేస్తుంటారు. అయితే వీరిద్దరిదీ ఎప్పుడూ వ్యతిరేక దిశలుగానే కనిపిస్తాయి. ఈ ఇరువర్గాల్లోనూ కొంతమంది అవినీతిపరులు లేకపోలేదు అనుకోండి అది వేరే విషయం. కానీ జర్నలిస్ట్‌ల విషయంలో మాత్రం నాయకులు బహు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా విషయం ఒక్కసారిగానీ వారి చెవిన పడిరదో ఇప్పుడు కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఏదో ఒక రోజు వారు దాన్ని ప్రజల్లో వార్తల రూపంలో తీసుకెళ్లకుండా ఉండరు.

అందుకే ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు స్తంభాల్లో మీడియాను కూడా ఒక స్తంభంగా పేర్కొంటూ ఉంటారు. సమాజంలో ఎవరైనా అన్యాయానికి గురైతే వారికి మీడియా అండగా ఉంటుంది. అలాంటి మీడియానే ధగా చేయాలిన చూస్తే… ఫలితం ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అనుభవిస్తోంది.

kcr telangana media

స్పీకర్‌కు రేవంత్‌ వింత విజ్ఞప్తి.. ఆశ్చర్యపోయిన సభ

విషయంలోకి వెళితే అధికారంలో ఉండగా బీఆర్‌ఎస్‌ నాయకులు వివిధ వర్గాలకు చెందిన ప్రజలను మోసం చేశారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని భూముల మీద వీరి కన్ను పడిరది. ఇదే వరుసలో 2008లో అప్పటికి 5 సంవత్సరాలకు పైగా సీనియారిటీ ఉన్న జర్నలిస్ట్‌లందరూ కలిసి ‘జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో`ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ’ పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దాదాపు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

నిజాంపేటలో 32 ఎకరాలను, పేట్‌ బషీరాబాద్‌లో 38 ఎకరాలను ప్రభుత్వం ఈ సొసైటీకి కేటాయించింది.
అనుకోని కారణాల వల్ల ఆ భూమి కోర్టు కేసుల్లో ఇరుక్కుంది. అప్పటి నుంచీ వాయిదాలు పడుతూ వచ్చిన కేసు మాజీ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రమణగారి పుణ్యాన ఓ కొలిక్కి వచ్చింది. నిజాంపేటలోని 32 ఎకరాలను సొసైటీకి అప్పగించిన ప్రభుత్వం.. పేట్‌బషీరాబాద్‌లోని భూమిని మాత్రం అనధికార కబ్జాలో పెట్టింది.

ఇందు కోసం తమ పార్టీకి చెందిన ఆందోల్‌ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్ట్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ను దొడ్డిదారిలో సొసైటీ ఎన్నికలు జరపకుండానే దొంగ పత్రాలు సృష్టించి జేఎన్‌జే సొసైటీకి అధ్యక్షుణ్ణి చేసింది. సొసైటీకి భూమిని కేటాయించిన సమయం(2008)లో ఊరికి చివరగా ఉన్న ఆ భూమి నేడు జాతీయ రహదారికి పక్కనే ఉంది. దీంతో టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుడి కన్ను దీనిపై పడిరది. దీంతో క్రాంతి కిరణ్‌తో ఆ భూమిని కాజేయాలని పన్నాగం పన్నినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే జర్నలిస్ట్‌లు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చారు. వివిధ రూపాల్లో విన్నపాలు చేశారు. అయినా అధికారం అండతో సభ్యులను పలుమార్లు బెదిరింపులకు గురి చేశారు. అయితే ఎన్నికలు దగ్గరకు రావడం.. విపక్షాలు, ప్రజాసంఘాలు కూడా తమకు మద్దతు తెలపడంతో జేఎన్‌జే సొసైటీలోని కొందరు సభ్యులు ఈ అన్యాయాన్ని ఎదిరించి పలు సభలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఎన్నికలకు ముందే ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రభుత్వం మా భూమిని మాకు అప్పగించకపోతే 1100 వంది సభ్యులం కలాన్ని ఆయుధంగా చేసి, వివిధ పత్రికలు, యూట్యూబ్‌ ఛానళ్లు, సోషల్‌ మీడియా వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమికి నడుం కడతాం అని హెచ్చరికలు జారీ చేశారు.

అయినప్పటికీ జర్నలిస్ట్‌ల హెచ్చరికలను కేసీఆర్‌ పెడచెవిన పెట్టడంతో వారంతా తమకు తోచిన మార్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి తమవంతు కృషి చేసి, ఆ పార్టీ ఓటమిలో భాగం పంచుకున్నారు. ఇదే విషయమై కేటీఆర్‌ రెండు రోజుల క్రితం తనకు సన్నిహితుడైన ఓ జర్నలిస్ట్‌ వద్ద ‘‘ఆ హెచ్చరికలను మేం సీరియస్‌గా తీసుకుని సమస్య పరిష్కారానికి ప్రయత్నించి ఉండాల్సింది’’ అంటూ విచారం వ్యక్తం చేశారట.