ఓవర్‌హెడ్‌ ట్యాంకులో మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ పోయడమేంట్రా

0
286
kt kunjumon producer

గ్రహచారం బాగోలేకపోతే… ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది అన్నట్లుంటుంది ఒక్కోసారి పరిస్థితి. ఎవరికోసమో తీసుకొచ్చిన మినరల్‌ బాటిల్స్‌ వల్ల ఇంకెవరి కొంపో ముంచడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇలాంటి సంకటస్థితిలో ఇన్‌కంటాక్స్‌రైడ్స్‌ ఎదుర్కొన్నారు సూర్య, జెంటిల్‌మెన్‌, ప్రేమికుడు, రాక్షసుడు, ప్రేమదేశం ఇలా భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ప్రముఖ తమిళ, మలయాళ నిర్మాత, రాజకీయ నాయకుడు కె.టి. కుంజుమోహన్‌. ప్రస్తుతం ఆయన ‘జెంటిల్‌మెన్‌`2’ తీసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇక విషయంలోకి వెళితే 1992లో శరత్‌కుమార్‌ హీరోగా కుంజుమోహన్‌ నిర్మించిన ‘సూర్య’ సూపర్‌ హిట్‌ అయ్యింది. 1993లో శంకర్‌ దర్శకత్వంలో అర్జున్‌ హీరోగా ఆయన నిర్మించిన ‘జెంటిల్‌మెన్‌’ సూపర్‌ డూపర్‌హిట్‌. 1994లో శంకర్‌ దర్శకత్వంలోనే ప్రభుదేవ హీరోగా నిర్మించిన ‘ప్రేమికుడు’ బంపర్‌హిట్‌ అయ్యింది. ఇలా వరుస సూపర్‌ డూపర్‌హిట్స్‌తో దూసుకుపోతున్న కుంజుమోహన్‌ కదిర్‌ దర్శకత్వంలో ‘కాదల్‌ దేశమ్‌’ అదేనండి తెలుగులో ‘ప్రేమదేశం’ చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

kt kunjumon producer

స్పీకర్‌కు రేవంత్‌ వింత విజ్ఞప్తి.. ఆశ్చర్యపోయిన సభ!

చెన్నైలోని కోడంబాకంలోని మంబలం గుండై ప్రాంతం బుద్ధ స్ట్రీట్‌లో కుంజుమోహన్‌ నివాసం ఉండేవారు అది మంచి పోష్‌ కాలనీ. కుంజుమోహన్‌ నివాసానికి వెనుక వీధిలో ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్‌ కమీషనర్‌ ఉంటున్నారు. అప్పటికే మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ వాడే ట్రెండ్‌ మొదలైంది. సదరు అధికారి ఓరోజు ఇంటినుంచి బయటకు వెళుతున్నారు.

ఇంతలో ఆ కాలనీకి మినరల్‌ వాటర్‌ సప్లై చేసే వ్యాన్‌ కనపడిరది. దాన్ని ఆపిన ఆయన నాలుగు రోజుల నుంచి వాటర్‌ బాటిల్స్‌ వేయడం లేదు. వాటర్‌ అయిపోయింది నాలుగు బాటిల్స్‌ వేసి వెళ్లు అన్ని వ్యాన్‌ అతనితో అన్నారు. దానికి అతను సాయంత్రం ట్రిప్పులో వేస్తాను అన్నాడు. అదేంటి వ్యాన్‌నిండా బాటిల్స్‌ ఉన్నాయి కదా. ఇప్పుడు వేయటానికి ఏంటి ఇబ్బంది అన్నారు. దానికి వ్యాన్‌ అతను సార్‌ ఇవన్నీ కుంజుమోహన్‌గారి ఇంటికి అన్నాడు.

ఆయన ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ ఉందా అన్నాడు ఆఫీసర్‌. లేదుసార్‌ ఇవన్నీ ఆయన ఇంట్లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకులో పోయటానికి అన్నాడు వ్యాన్‌ అతను. ఓవర్‌హెడ్‌ ట్యాంకులో మినరల్‌ వాటర్‌ పోయడం ఏంట్రా అన్నాడు ఆయన. గత సంవత్సర కాలంగా ఇలాగేపోస్తున్నాం అన్నాడు వ్యాన్‌ అతను. క్షణాల్లో విషయం అర్ధమైపోయింది అధికారికి. ఆ మరుసటి రోజే కుంజుమోహన్‌ ఇల్లు, ఆఫీసులపై ఏకకాలంలో ఇన్‌కంటాక్స్‌ దాడులు జరిగాయి. అలా మినరల్‌ వాటర్‌ బాటిల్‌ కేటీ కుంజుమోహన్‌ కొంప ముంచిందన్నమాట.