5 లక్షల నగలను ఎత్తుకెళ్లిన ఎలుకలు

0
372

ఎలుకలు గురించి తెలియనిదెవరికి.. సహజంగా ఎలుకలంటే మనందరికీ ఏవో ఎంగిలి మెతుకులు తినే జీవులు అనే ఫీలింగ్‌ ఉంటుంది. అయితే ఎలుకలందు బంగారం తినే ఎలుకలు వేరయా అని.. చెప్పుకోవాలేమో ఈ వార్త చదివిన తర్వాత. ఛస్‌… ఎంగిలి మెతుకులు తిని బతికే మూషికాలకు బంగారం కావాల్సొచ్చిందా అంటారా.. అయితే ఇక చదవండి మీకే తెలుస్తుంది. ముంబాయిలోని గూర్గావ్‌లో నివశించే 45 సంవత్సరాల ప్లానిబేల్‌ ఇళ్లల్లో పని చేసి జీవనం సాగిస్తోంది.

రిచ్‌ పనిమనిషి అన్నమాట

పనిమనిషి అంటే.. అట్టాంటి.. ఇట్టాంటి పనిమనిషి కాదు.. లక్షల విలువ చేసే నగలు కూడ బెట్టుకునేంత రిచ్‌ పనిమనిషి అన్నమాట. మంగళవారం బంధువుల ఇంట్లో ఫంక్షన్‌ ఉండటంతో బ్యాంక్‌ లాకర్‌లో ఉన్న తన నగల్లో నుంచి ఓ 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే నగలను తీసుకుంది. వాటిని పెట్టుకుని ఫంక్షన్‌కు హాజరయ్యింది. గురువారం ఆ నగలను మరల బ్యాంకు లాకర్‌లో పెట్టడానికి బయలు దేరింది.

తీరా బ్యాంకుకు వెళ్లి చూసుకుంటే

సహజంగానే మన ప్లానిబేల్‌ది జాలి గుండె.. దానికి తోడు సాయం చేసే చేతులు. ఇంకేముంది.. దారిలో ఒక చోట ఆగి ఎవరికైనా పేద వారికి ఇవ్వటానికి వడ పావ్‌ కట్టించింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత తనకు ఎదురు పడిన పిల్లలకు ఆ కవర్‌ను ఇచ్చి తినమని చెప్పి వెళ్లిపోయింది. తీరా బ్యాంకుకు వెళ్లి చూసుకుంటే తన దగ్గరున్న సంచిలో నగలు కనిపించలేదు. అప్పుడు నగల పర్సును వడపావ్‌ ఉన్న ఉన్న కవర్‌లో పెట్టిన విషయం గుర్తుకొచ్చి వెనక్కి వచ్చి పిల్లలు ఎదురైన ప్రాంతంలో వెతగ్గా వారు కనిపింలేదు.

సీపీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా

వెంటనే పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చింది. మొత్తానికి సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పిల్లలను ట్రేస్‌ చేశారు. వారిని విచారించగా, తమకు వడపావ్‌ అంటే ఇష్టం లేదని, అందుకే చెత్తకుండీలో పారేశామని చెప్పారు. అక్కడికి వెళ్లి వెతగ్గా సంచీ కనిపించలేదు. ఈ చెత్తకుండీకి సమీపంలోని సీపీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా, రెండు ఎలుకలు వచ్చి ఆ సంచీని తమ కలుగులోకి లాక్కుపోయినట్లు రికార్డు అయింది.

ఎలుకలు ఎంత పనిచేశాయో

వెంటనే పలుగు, పారతో అక్కడ తవ్వి ఆ నగల సంచీని ఆమెకు అప్పగించారు పోలీసులు. ఎలుకలు ఎంత పనిచేశాయో అని పోలీసులతో పాటు అందరూ ఆశ్చర్యపోయారట.