ఆగష్టు 25 న ఇండియా షేక్ అవుతుందని ఎవరో అన్నారే..!

0
652

సహజంగానే హీరో విజయ దేవరకొండకి కోపం ఎక్కువని అందరూ చెబుతూ ఉంటారు. తన ఆటిట్యూడ్ తో విమర్శకుల నోటికి పని చెబుతూ ఉంటాడు. అయితే ఇదే ఆటిట్యూడ్ వలన యూత్ లో ఫాలోయింగ్ బాగానే వచ్చింది. కానీ సినిమాలు ఆడక పోతే ఆ ఫాలోయింగ్ పోవడం ఖాయమని చెప్పాలి. ఇప్పుడు అదే ఆటిట్యూడ్ వలన మరో సారి విజయ దేవరకొండపై విమర్శలు ఎక్కుపెట్టారు సినీ విశ్లేషకులు.

లైగర్ ట్రయిలర్ రిలీజ్ వేడుకలో

తనకి తెలిసి మాట్లాడతాడో లేక తెలియక మాట్లాడతాడో గానీ.. ఉన్న విషయాన్నీ బాగా ఎక్కువ చేసి మాట్లాడతాడు. అదే ఇప్పుడు లైగర్ సినిమా ఫలితంతో కొంప ముంచింది. సినిమా విడుదల అయి ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో గతంలో విజయ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లైగర్ ట్రయిలర్ రిలీజ్ వేడుకలో విజయ్ మాట్లాడుతూ.. ఆగష్టు 25 న ఇండియా షేక్ అవుతుందని అన్నాడు. ఇక ఇప్పుడు ఆగష్టు 25 రానే వచ్చింది.

ఆటిట్యూడ్ మార్చుకుంటే మంచిది

ఎట్టకేలకు థియేటర్ లలో లైగర్ సినిమా విడుదల అయింది. విడుదల అయిన తొలి ఆటకే సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా కథ కంచికే అనిపిస్తుంది. ఇప్పటికే ప్లాప్ లలో కొట్టుమిట్టాడుతున్న విజయ దేవరకొండకి ఇది మింగుడు పడని విషయమని చెప్పాలి. ఆగష్టు 25 న ఇండియా షేక్ కాదు కదా.. కనీసం తెలుగు రాష్ట్రాలలో సినిమా చూసే దిక్కే లేదని నెటిజన్లు సైటైర్ లు వేస్తున్నారు. ఇప్పటికైనా విజయ దేవరకొండ తన ఆటిట్యూడ్ మార్చుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.