అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న ఏకైక టాలీవుడ్ స్టార్స్ వాళ్లిద్దరే!

0
331
opening ceremony of the Ram Mandir in Ayodhya

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన అయోధ్య రామమందిరం వచ్చే నెల 22 వ తారీఖున అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి రామ భక్తులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఆ ప్రాంత ముఖ్యమంత్రి యోగి దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటుగా బీజేపీ పార్టీ ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.

opening ceremony of the Ram Mandir in Ayodhya

రాజమౌళి కి 9 ఏళ్ళ డేట్స్ కేటాయించిన సూపర్ స్టార్ మహేష్ బాబు!

వీరితో పాటుగా సినీ నటులకు కూడా ఆహ్వానం దక్కింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హోదాలో ఉన్న ప్రతీ ఒక్కరిని ఆహ్వానిస్తారు అని అనుకున్నారు కానీ, కేవలం ఇద్దరికీ మాత్రమే ఆహ్వానం దక్కింది అట.

ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే బీజేపీ పార్టీ కూటమి లో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఆహ్వానం దక్కకపోవడమే. ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ టీడీపీ తో జతకట్టడం బీజేపీ అధిష్టానం కి నచ్చలేదు కాబోలు.

అందుకే ఆయనకి ఆహ్వానం అందించలేదు అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. చిరంజీవి మరియు ప్రభాస్ ఎలాంటి పార్టీ లకు చెందిన వారు కాదు. అందరికి అజాత శత్రువులు, అందుకే వాళ్ళిద్దరినీ ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మరి వీళ్లిద్దరు వెళ్తారా లేదా అనేది చూడాలి.

చిరంజీవి కి అంత గౌరవం ఇచ్చి ఆహ్వానించినప్పుడు వెళ్లకుండా మాత్రం ఉండదు. కానీ ప్రభాస్ కదిలి రావడమే పెద్ద సమస్య. రామ మందిరం ఓపెనింగ్ కి రాకపోతే ప్రభాస్ చాలా తీవ్రమైన వ్యతిరేకత ని ఎదురుకునే ప్రమాదం ఉంది.

ఎందుకంటే ఈ ఏడాది ఆయన ‘ఆదిపురుష్’ చిత్రం లో నటించి రామాయణం ని అవహేళన చేసాడు అంటూ రామ భక్తుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది.

ఇప్పుడు రామకార్యానికి సంబంధించిన మహా కార్యానికి ఆహ్వానం అందినా రాకపోతే మరోసారి భక్తుల ఆగ్రహానికి ప్రభాస్ బలి కావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ప్రభాస్ ఎలాంటి షూటింగ్స్ లోను పాల్గొనడం లేదు. రీసెంట్ గా విడుదలైన సలార్ మూవీ సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.