ఆ దర్శకుడి పాలప్యాకెట్‌ కష్టాలు వింటే…

0
319
difficulties of balachandhar director milk packet

కష్టాలందు సినిమా కష్టాలు వేరయా అంటారు. సినిమావాళ్ల సుఖాలు ఎలా ఉంటాయో.. కష్టాలు అంతకంటే ఘోరంగా ఉంటాయి. పైన పటారం.. లోన లొటారం లాంటి బిల్డప్‌లన్నమాట.

ఆకలిరాజ్య సినిమాలో బాలచందర్‌గారు చూపించినట్లన్నమాట. ఇలాంటి సినిమా కష్టాలతో బతుకు బండిని లాగి.. ఆనక కీర్తి, ప్రతిష్ఠలు సంపాదించిన ఓ దర్శకుడి గురించి చెబుతాను. నేను (రచయిత) ఓ దిన పత్రికలో సినిమా రిపోర్టర్‌గా పనిచేస్తున్న సమయం..

difficulties of balachandhar director milk packet

అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న ఏకైక టాలీవుడ్ స్టార్స్ వాళ్లిద్దరే!

కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుల్లో ఒకరు ఆయన. (అదేంటో గానీ ఆయన కెరీర్‌ దాదాపు ముగిసిపోయే దశలో చేసిన సినిమా ఆయనకు ఇంటిపేరుగా మారడం ఈయనకొక్కడికే చెల్లింది)నాకు మంచి చనువు ఉండేది. ఒకరోజు ఏదో సినిమా విషయమై కలవాలని ఫోన్‌ చేశాను.

రేపు ఉదయం 10 గంటలకు పద్మాలయాలో కలుద్దాం అన్నారు. నేను టంచన్‌గా వెళ్లాను. అప్పట్లో పద్మాలయాలోనే జెమిని కలర్‌ల్యాబ్‌లో కూడా ఉండేది.ఆయన దర్శకత్వం వహించిన ఓ మల్టీస్టారర్‌ కామెడీ సినిమాకి సంబంధించిన వర్క్‌ జరుగుతోంది అక్కడ.

ఆ పని ముగించుకుని నా దగ్గరకు వచ్చారు. ఇద్దరం అలా దూరంగా వెళ్లి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఆయన అసిస్టెంట్‌ వచ్చాడు. డైరెక్టర్‌ గారి పిలుపుకోసం దూరంగా నిలబడి ఉన్నాడు. ఈయన రమ్మని సైగ చేశారు. అతను వచ్చి ఓ సూట్‌కేస్‌ చేతిలో పెట్టాడు. దాన్ని ఓపెన్‌ చేసి చూశారు.

దాంట్లో డబ్బు కట్టలు. మళ్లీ దాన్ని క్లోజ్‌ చేసి ‘‘ఇంట్లో ఇచ్చేయ్‌’’ అని పంపించేశారు. నేను ‘‘సార్‌ ప్రతి సినిమావాడి జీవితంలోనూ సినిమా కష్టాలు ఉంటాయి కదా.. మీ సినిమా కష్టాలు..’’ అన్నాను.

నా సినిమా కష్టాలను పాలప్యాకెట్‌ కష్టాలు అని చెప్పాలి. ఇప్పుడు చూశారుగా మీరు.. అవి 30 లక్షలు. ఒక నిర్మాత అడ్వాన్స్‌ పంపారు. ఒకప్పుడు నేను తెల్లవారు జామునే లేచి ఇంట్లోంచి వెళ్లిపోయినా..

అర్ధరాత్రి మా ఆవిడ, పాప పడుకున్నాక వచ్చినా మా ఆవిడకు అర్ధమైపోయేది.. వీడి దగ్గర రేపు ఉదయం పాల ప్యాకెట్‌కు కూడా డబ్బులు లేవు అని. అంతటి కష్టాలు అనుభవించాను.

దేవుడి దయవల్ల మా ఆవిడ తరపున బంధువులు మా ఇంటి చుట్టుపక్కలే ఉండటం వల్ల ఎలాగో మేనేజ్‌ చేసేది. ఇప్పుడు ఇంత డబ్బు సంపాదించినా ఆ కష్టాలను మర్చిపోలేను అన్నారు.