నైజాం ప్రాంతం లో ‘సలార్’ బీభత్సం..డేంజర్ లో పడ్డ #RRR రికార్డ్స్!

0
364
Salaar disaster in Nizam area RRR records in danger

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సలార్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

సలార్ చిత్రం అద్భుతంగా వసూళ్లను రాబడుతున్న సెంటర్స్ లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది నైజాం ప్రాంతం గురించి. ఈ ప్రాంతం లో ప్రభాస్ ఎంత స్ట్రాంగ్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Salaar disaster in Nizam area RRR records in danger

ప్రభాస్ ఒక్క డిన్నర్ కోసం చేసే ఖర్చు తో 100 మంది తినొచ్చు తెలుసా!

ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా ఈ ప్రాంతం లో రికార్డు స్థాయి వసూళ్లు వస్తుంటాయి.

ఆయన గత చిత్రం ‘ఆదిపురుష్’ అట్టర్ ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ ఈ ప్రాంతం లో దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇంత వసూళ్లు మన స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు కూడా లేకపోవడం విశేషం.

అందుకే ‘సలార్’ మూవీ నైజం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 65 కోట్ల రూపాయలకు ఈ ప్రాంతం లో జరిగింది.

బ్రేక్ ఈవెన్ కి చాలా పెద్ద టార్గెట్, టాక్ వచ్చినా కూడా అంత వసూళ్లను రాబట్టడం కష్టమేమో అని ట్రేడ్ పండితులు అనుకున్నారు. కానీ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా కారణంగా ఈ చిత్రానికి కేవలం 5 రోజుల్లోనే 57 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇది సాధారణమైన రికార్డు కాదు. మరో మూడు రోజులు నైజాం ప్రాంతం లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టిన మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకుంటుందని, ఫుల్ రన్ లో ఈ ప్రాంతం లో కచ్చితంగా 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ ప్రాంతం లో #RRR చిత్రం దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. #RRR తర్వాత 50 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న ఏకైక సినిమాగా సలార్ చిత్రం నిల్చింది.

వచ్చే ఏడాది సలార్ రేంజ్ వసూళ్లు ఏ చిత్రం రాబడుతుందో చూడాలి అంటూ అభిమానులు ఆన్లైన్ లో బెట్టింగ్స్ వేసుకుంటున్నారు.

సంక్రాంతి కానుకగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి 50 కోట్లు వసూలు చేసేంత సత్తా ఉంది, మరి ఆ రేంజ్ వసూళ్లను గుంటూరు కారం అందుకుంటుందా, లేదా పవన్ కళ్యాణ్ ఓజీ అందుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.