రేవంత్ విషయం లో అన్యాయం చేసిన బిగ్ బాస్

0
396

స్టార్ మా ఛానల్ లో అట్టహాసం గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 నిన్న గ్రాండ్ ఫినాలే తో ఘనంగా ముగిసింది..ఈ సీజన్ మొత్తం ప్రేక్షకుల అంచనాలకు మరియు వారి అభిరుచులకు వ్యతిరేకంగా సాగింది..ఎలిమినేషన్స్ విషయం లో ప్రజాభిష్టం కి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ విమర్శలపాలైన ఈ సీజన్, టైటిల్ విన్నర్ విషయం లో కూడా అలాగే చేసింది..రేవంత్ ని ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా అయితే ప్రకటించారు కానీ..ఆయన ఫ్యాన్స్ లో సంతోషం ని మాత్రం నింపలేకపొయ్యారు.

రేవంత్ కి ఉన్న క్రేజ్

ఎందుకంటే చివరి నిమిషం లో నాగార్జున రేవంత్ కంటే ఎక్కువగా శ్రీహాన్ కి ఓట్లు వచ్చాయి అని చెప్తూ భారీ ట్విస్ట్ ఇచ్చి అందరిని షాక్ కి గురయ్యేలా చేస్తాడు..ఇది విని మొదటి ఎపిసోడ్ నుండి వాళ్ళిద్దరితో బెస్ట్ ఫ్రెండ్ గా కొనసాగిన శ్రీ సత్య కూడా నోరెళ్లబెడుతుంది..ఎందుకంటే కంటెస్టెంట్స్ అందరికీ రేవంత్ కి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఎలాంటిదో బయటకి వచ్చిన తర్వాత అర్థం అయ్యింది.

రేవంత్ కి 69 శాతం ఓటింగ్

అతనికి వచ్చే ఓటింగ్ లో పావు శాతం కూడా మిగిలిన కంటెస్టెంట్స్ కి రావడం లేదనే విషయం అందరూ చూసారు..సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ ద్వారా అది చాలా తేలికగా కనిపెట్టేయొచ్చు..మొన్న యూట్యూబ్ లో స్టార్ మా ఛానల్ కండక్ట్ చేసిన పోలింగ్ లో కూడా రేవంత్ కి 69 శాతం ఓటింగ్ వస్తే శ్రీహాన్ కి కేవలం 19 శాతం ఓటింగ్ మాత్రమే వచ్చింది.

ఇంత భారీ తేడా

సోషల్ మీడియా లో జరిగే ఓటింగ్ కి మరియు బిగ్ బాస్ అధికారిక ఓటింగ్ కి ఇంత భారీ తేడా మాత్రం ఉండదు..ఎందుకంటే గత సీజన్స్ అన్నిట్లో సోషల్ మీడియా లో ఎలాంటి ఫలితాలు అయితే వచ్చేవో అధికారికంగా కూడా అలాంటి ఫలితమే వచ్చేది..కానీ సీజన్ 6 మాత్రం చాలా విడ్డూరంగా సాగిపోయింది..బిగ్ బాస్ చరిత్రలోనే ఇటువంతి దరిద్రపు సీజన్ ఎక్కడ ఉండదని..ఇంకోసారి బిగ్ బాస్ చూడబోమని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.