ఫైల్స్ మిస్ పై రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

0
271
Missing Files Issue in Telangana CM Revanth Reddy

రీసెంట్ గానే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిపోయింది. మొదటి అసెంబ్లీ సమావేశం లో మంత్రులు కూడా ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేసారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం లో కొన్ని ఫైల్స్ మిస్ అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం లో 5 లక్షల కోట్ల రూపాయలకు పైగానే అప్పులు ఉన్నాయని, కానీ మా దృష్టిలోకి వచ్చింది ఏంటి అంటే, అంతకంటే ఎక్కువ అప్పులు కూడా ఉన్నాయని, కానీ ఆ రహస్యాలు ఏవి కూడా బయటకి రానివ్వకుండా బీఆర్ఎస్ పార్టీ ఫైల్స్ ని తన మనుషుల చేత మాయం చేయిస్తుంది అంటూ తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క రీసెంట్ గా జరిగిన ఒక మీడియా సమావేశం లో చెప్పుకొచ్చాడు.

సచివాలయం లో పని చేసే వారిని తమకి అనుకూలంగా ఉండేవారిని బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో పెట్టుకుందని, ఇప్పుడు వాళ్ళే ఈ ఫైల్స్ ని మాయం చెయ్యడం, లేదా కాల్చి వెయ్యడం వంటివి చేస్తుందని చెప్పుకొచ్చారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా మాజీ పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఛాంబర్ లో ఉన్న ఫైల్స్ కనిపించడం లేదు, దీనిపై ప్రస్తుతం కోర్టులో కేసు కూడా నడుస్తుంది.

ఈ కేసు ని ప్రత్యేకంగా సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ఛాంబర్ లో విద్యా పరిశోధనా శిక్షణ సంస్థలోని ఫైల్స్ దొంగిలించడానికి పలువురు దుండగులు ప్రయత్నం చెయ్యగా, అధికార వర్గాలు పసిగట్టడం తో వాళ్ళు పారిపోయినట్టు చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి కి ఇంత మంది సోదరులు ఉన్నారా?

ఇలా అవకతవకలు చాలా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అన్నీ శాఖలకు సంబంధించి శ్వేత పత్రాలు విడుదల చెయ్యడానికి సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. ఇలా చేస్తే ఏయే శాఖలో ఎంత అప్పులు ఉన్నాయి, ఎన్ని పనులు బ్యాలన్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. గత ప్రభుత్వం లో జరిగిన తప్పులను జనాలకు ఎత్తి చూపిస్తూనే, కాంగ్రెస్ పార్టీ తలపెట్టబోయే కార్యక్రమాల గురించి కూడా కోట్లాది మంది ప్రజలకు తెలిసినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అట.