రేవంత్ విషయంలో సురేఖ వాణి కూతురు ఎమోషనల్!

0
216
Surekha Vani Daughter Supritha Gets Troll On Posting Revanth Reddy Picture 2023

టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సురేఖ వాణి సోషల్ మీడియా ద్వారా యూత్ ఆడియన్స్ కి మరింత చేరువైన సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా ఓపెన్ మైండ్ తో బోల్డ్ గా వ్యవహరించడం సురేఖ వాణి స్టైల్. ఆమె కూతురు సుప్రీతా కి కూడా సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.

అందుకే సుప్రీతా కి ఉన్న పాపులారిటీ ని ఉపయోగించుకోవడానికి పలు బ్రాండ్స్ కూడా క్యూ కడుతుంటాయి. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ ఇంస్టాగ్రామ్ లో ఉన్న ప్రముఖ సెలెబ్రిటీలతో విన్నూతన రీతిలో రీల్స్ చేయించి బీఆర్ఎస్ పార్టీ పథకాలను జనాలకు ప్రచారం చెయ్యిస్తునే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ ని దెప్పిపొడిచేలా చేసారు.

Surekha Vani Daughter Supritha Gets Troll On Posting CM Revanth Reddy

ఫైల్స్ మిస్ పై రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. దీంతో ఇంస్టాగ్రామ్ లో అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కి సపోర్టు చేస్తూ రీల్స్ అప్లోడ్ చేసిన సెలబ్రిటీస్ మొత్తం ఆ రీల్స్ ని తొలగించేసారు. వారిలో సుప్రీతా కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీ గెలవగానే రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ఫోటోని అప్లోడ్ చేసింది. దీనికి నెటిజెన్స్ నుండి సుప్రీతా కి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. చాలా మంది ఆమెని అడ్డమైన బూతులు కూడా తిట్టారు.

ఈ బూతులకు బాగా హర్ట్ అయినా సుప్రీతా మాట్లాడుతూ ‘ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని నన్ను కొంతమంది ఆకతాయిలు ట్యాగ్ చేసి వేధిస్తున్నారు. నేను ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కి సపోర్ట్ చేశాను,నిజమే. కానీ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియచేయడం లో తప్పేమి ఉంది?

ఎందుకు నన్ను ఇలా బూతులు తిడుతూ మానసిక క్షోభ కి గురి అయ్యేలా చేస్తున్నారు?..నేను మీకు ఏమి అన్యాయం చేశాను..??, నాపై ఎందుకు ఇలా ద్వేషం పెంచుకున్నారు’ అంటూ సుప్రీతా చాలా ఎమోషనల్ గా పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.