రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

0
198
telangana cm revanth reddy

ఎన్నికలలో గెలవడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఎలా నిలుపుకున్నాం అనేది కూడా ఎంతో ముఖ్యమైన విషయం. రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ప్రభుత్వాన్ని స్థాపించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు. కేవలం 64 స్థానాలతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క సీట్ కూడా రాలేదు. ప్రభుత్వాన్ని స్థాపించిన పార్టీ కి హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా రాకపోవడం విశేషం.

పార్టీ బలోపేతం కొరకు, గెలిచిన కొంతమంది బీఆర్ఎస్ హైదరాబాద్ ఎమ్యెల్యే లను కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా గెలిచినా బీఆర్ఎస్ ఎమ్యెల్యే లపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. రీసెంట్ గానే ఖమ్మం జిల్లా నుండి గెలిచినా ఒక బీఆర్ఎస్ ఎమ్యెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యినట్టు వార్తలు వినిపించాయి.

telangana cm revanth reddy

2019 ఎన్నికల సమయం లో మన ఏపీ లో తెలుగు దేశం పార్టీ కూడా ఇలాగే ఇతర పార్టీల ఎమ్యెల్యే లకు గాలం వేసింది. దాదాపుగా 23 ఎమ్యెల్యేలు మరియు ముగ్గురు ఎంపీలను తమ పార్టీలోకి లాగేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ లో ఇదే మోడల్ ని అనుసరించబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే రేవంత్ రెడ్డి లో ఎక్కడో తెలియని భయం అలాగే ఉండిపోయింది అట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సీనియర్ నాయకులకు రేవంత్ రెడ్డి అంటే అసలు ఇష్టం లేదు.

రేవంత్ విషయంలో సురేఖ వాణి కూతురు ఎమోషనల్!

ఆయన ముఖ్యమంత్రి అవ్వడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ని ముఖ్యమంత్రి గా ప్రకటించిన వెంటనే సీనియర్ నాయకులూ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలు వారిని బుజ్జగించి రేవంత్ మరియు సీనియర్ నాయకుల మధ్య సయోధ్య కుదిరించిన తర్వాతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది కానీ, వాళ్ళు మళ్ళీ ఎప్పటికైనా తనపై ఎదురు తిరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాడు. ఫైల్స్ మిస్ పై రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

అందుకే రేవంత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే 40 మంది సిట్టింగ్ ఎమ్యెల్యే లు రేవంత్ కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి మరో 20 మంది ఎమ్యెల్యే లను తీసుకుంటే రేపు ఏదైనా తేడా జరిగినప్పుడు సొంతగా ప్రభుత్వాన్ని స్తాపించొచ్చు అనే ముందు చూపుతో ఉన్నాడట రేవంత్.