ముంబయిపై కనీవినీ ఎరుగని దాడి ప్లాన్‌ భగ్నం

0
352
mumbai india

చింత చచ్చినా, పులుపు చావలేదు అన్నచందాన ఉంది పాకిస్థాన్‌ పరిస్థితి. ఎప్పుడూ అంతర్గత సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతూ.. ప్రపంచం చేత దాదాపు వెలివేయబడిన పాకిస్థాన్‌ ఉ**గ్రవాదానికి కేరాఫ్‌ అడ్రస్‌.

ఈమధ్య కాలంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కూటికి లేక ప్రపంచ దేశాల సాయంపై బ్రతుకుతోంది. అయినప్పటికీ తన ఉ**గ్రవాద బుద్ధిని మాత్రం మార్చుకోలేక పోతోంది. పొరుగుదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో అశాంతిని సృష్టించడం.. దాని ద్వారా తన ప్రతిష్టను తానే దిగజార్చుకోవడం.. ఇలా స్వయం కృతాపరాధంతో పాక్‌ తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది.

ముఖ్యంగా భారత్‌లో అశాంతి సృష్టించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కొన్నింటిలో సఫలం అయ్యింది కూడా. అయితే పాక్‌ ఆశించిన స్థాయిలో భారత్‌ ఉ**గ్రదాడులకు బెదరలేదు. ఇటీవల కాలంలో కొంత వెనక్కు తగ్గినట్టు అనిపించినప్పటికీ తాజాగా భారతదేశ ఆర్థిక రాజధాని ముంబాయిపై కనీవినీ ఎరుగని దాడికి ప్లాన్‌ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

mumbai india

అయితే భారత ఎన్‌.ఐ.ఏ ఈ దాడిని ముందే పసిగట్టి భగ్నం చేసింది. గతంలో మాదిరి కాకుండా ఈసారి దాదాపుగా 40 డ్రోన్లను ఏకకాలంలో ముంబాయిపైకి ప్రయోగించి విధ్వంసం సృష్టించాలని ప్లాన్‌ వేశారు ఉగ్రవాదులు.

ఇందుకోసం ముంబాయికి 53 కి.మీ దూరంలోని పద్ఘా అనే గ్రామాన్ని షెల్టర్‌ జోన్‌గా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి నాయకత్వం వహించిన ఐఎస్‌ మాడ్యూల్‌ సాకిబ్‌ నాచన్‌ ఎన్‌.ఐ.ఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇతడు ఐఎస్‌ ఖలీఫాకు విధేయుడు. ఇతని కుమారుడు షామిల్‌కు కూడా పే**లుడు పదార్థాల తయారీలో అనుభవం ఉన్నట్లు వెల్లడైంది. పద్ఘా గ్రామాన్ని తమ ఉ**గ్రవాద కార్యకలాపాలకు ఎంచుకున్న వీరు ఈ గ్రామం పేరు ‘ఆల్‌`షామ్‌’గా మార్చారు.

అంటే ‘గ్రేట్‌ సిరియా’ అని అర్ధం. ఇది ముంబాయి నగరానికి కేవలం 53 కి.మీ. ఉండటం పోలీసులను, జాతీయ దర్యాప్తు సంస్థలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ గ్రామాన్ని స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకున్న వీరు ఏకంగా ఇక్కడ ఐ**సిస్‌ ఉ**గ్రవాదులకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలియడంతో కేంద్రం ఉలిక్కిపడిరది.

దీనిపై లోతైన దర్యాప్తుకు ఆదేశించింది. ముంబాయి నగరంలోని 40 ప్రధాన ప్రాంతాలను ఎంచుకుని, వాటిపై ఏకకాలంలో డ్రోన్‌ల సాయంతో దాడులు చేయాలని పకడ్బందీ వ్యూహాన్ని పన్నారు. అయితే సకాలంలో ఎన్‌.**ఐ.ఏ ఈ ప్లాన్‌ను నిర్వీర్యం చేసింది.