సార్వత్రిక ఎన్నికలపై అప్‌డేట్‌ వచ్చేసింది

0
268
Chandrababu Pawans joint battle with bhogi mantalu

దేశంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రియల్‌ మొదటి వారం లేదా రెండో వారంలో ఉండవచ్చని తెలుస్తోంది. ఎన్నికల తేదీ ఏప్రియల్‌ 16గా భావించి ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఢల్లీి ఎన్నికల ప్రధాన అధికారి.

ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్టు ఆయన తెలియజేశారు. ఢల్లీి సీఈఓ ఇచ్చిన వివరణను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ట్విట్టర్‌లో రీపోస్ట్‌ చేయడంతో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్టు అయింది.

అయితే సార్వత్రిక ఎన్నికలు సంబంధించి అధికారికంగా ప్రకటించిన దాన్నే మనం పరిగణనలోకి తీసుకోవటం ఆనవాయితీ. దీంతో ఇప్పటికే ఏప్రియల్‌లో ఎన్నికలు అంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోందని అనుకోవాలి. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Is this the latest survey of I'pack
Is this the latest survey of I’pack

ఈమేరకు ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశంఉంది. అప్పటి నుంచి ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వస్తుంది.

2019లో ఏప్రిల్‌ 11 నుంచి మే 17 వరకూ ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. 2019 మే 23 ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో మొదటి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్ని విడతల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయో చూడాలి. అయితే ఇప్పటికే ఏపీలో ఎన్నికలకు సంబంధించి జోరుగా పనులు జరుగుతున్నాయి.

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీలో పర్యటించింది. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ఓట్ల నమోదు, దొంగ ఓట్లు వంటి అనేక అంశాలపై రాజకీయ పార్టీలు ఫిర్యాదులు సమర్పించాయి. ఈ మేరకు నకిలీ ఓట్ల నమోదుకు సహకరించిన వారిపై ఎన్నికల సంఘం చర్యలు కూడా చేపట్టింది.

ఇదే విషయంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను కూడా సస్పెండ్‌ చేయడం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా సమాచారంతో ఇప్పటికే రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణాన్ని పార్టీలు మరింత ముందుకు తీసుకు పోవటానికి అవకాశం దొరికింది.

ప్రస్తుతం అటు వైసీపీ అభ్యర్ధుల మార్పు, చేర్పులతో బిజీగా ఉండగా, ఇటు టీడీపీGజనసేన కూటమి వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళుతోంది. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం ట్వీట్‌తో ఇక దేశ వ్యాప్తంగా రాజకీయం రంజుగా మారనుందని చెప్పవచ్చు.