బాబాయి సుబ్బారెడ్డికి షర్మిళ మాస్‌ వార్నింగ్‌

0
211
ys sharmila

ఏదైనా జరగకూడదని జగన్‌ శిభిరం భావించిందో… అదే జరుగుతోంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని గంపగుత్తగా తానే అనుభవించాలనే ఆలోచనతో జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్నారు.

నిన్న మొన్నటి వరకూ ఈ విభేదాలు టీకప్పులో తుఫాను భావించిన వారికి షర్మిళ వేస్తున్న ఒక్కో అడుగు, మాట్లాడుతున్న ఒక్కో మాట క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.

ప్రమాణ స్వీకారం చేసిన రోజున జగన్‌పై డైరెక్ట్‌గా ‘జగన్‌రెడ్డి’ అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన ఆమె… ఈరోజు బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డికి కూడా డైరెక్ట్‌గా మాస్‌ వార్నింగ్‌ ఇచ్చిపడేసింది.

ys sharmila

వివరాల్లోకి వెళితే ఆదివారం షర్మిళ ఏపీసీసీ భాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అభివృద్ధి అనేది లేకుండా చేశారని, ఉద్యోగాలు కల్పన గాలికొదిలేశారని, మైనింగ్‌, లిక్కర్‌, శాండ్‌లను అడ్డగోలుగా దోచుకుని, కోట్లు కూడబెట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు.

దీనికి ఆమె బాబాయ్‌, మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి కూడా మిగిలిన వైసీపీ నేతల్లా స్పందించారు. జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, అది కనపడని కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, కావాలంటే తాము చేసిన అభివృద్ధిని చూపిస్తామని షర్మిళకు కౌంటర్‌ వేశారు.

ఈ విషయంపై ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘జగన్‌రెడ్డి గారిని జగన్‌రెడ్డి అనడం కూడా తప్పుగా కనిపిస్తోంది కొందరికి.

సరే జగన్‌అన్న గారు అంటాను. నాకేం అభ్యంతరం లేదు. మీరు చేసిన అభివృద్ధిని చూపిస్తే, చూడటానికి నేను సిద్ధమే. ప్లేస్‌, డేట్‌ మీరు చెప్పినా సరే… మమ్మల్ని చెప్పమన్నా సరే అంటూ బాలయ్య సినిమాలోని ఊరమాస్‌ డైలాగ్‌ను చెప్పారు.

మాతోపాటు మీడియా, మేధావులు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మాకు మీరు కట్టిన రాజధాని, మెట్రో, ఇతర అభివృద్ధిని చూడాలని అందరం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాం’’ అంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు షర్మిళ.