వైసీపీ కార్యకర్తలతో పోటీ పడుతున్న సాక్షి

0
418
ys sharmila

పెద్దలు అంటూ ఉంటారు ప్రాప్తం ఉన్నంత వరకూ ఏదైనా మనది.. ఒక్కసారి గానీ అది కాలధర్మలో కొట్టుకుపోతే ఇక మన గతి అధోగతే.. కర్రే పామై కరుస్తుంది.. పిల్లి కూడా పులిలా గాండ్రిస్తూ మీదికి దూకుతుంది. చేసిన కర్మ వాయువేగంతో మన నాశనం దిశగా దూసుకొస్తుంది.

ఇందుకు వ్యక్తులు, వ్యవస్థలు ఏవీ మినహాయింపు కాదు. ప్రస్తుతం తెలుగువారి మనస్సాక్షి సాక్షి పత్రిక పరిస్థితి ఇలాగే ఉంది.

నిన్నటి వరకూ ఆ పత్రిక అధినేతల్లో ఒకరైన వై.యస్‌.ఆర్‌ కూతురు షర్మిళను.. షర్మిళారెడ్డి.. షర్మిళారెడ్డి అంటూ సంబోధిస్తూ వార్తలు రాసిన ఆ పత్రికే నేడు ఆమెను ‘షర్మిళా శాస్త్రీ’ అంటూ సంబోధిస్తూ వార్తలు ప్రచురించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ys sharmila

అన్నతో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్‌ పార్టీలో జేరి, ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిళ తొలి రోజే రాష్ట్రంలో జగన్‌ పాలన దారుణంగా ఉంది అంటూ విమర్శలు గుప్పించారు.

రెండో రోజు (సోమవారం) అస్సాంలో తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ న్యాయ్‌ జోడో యాత్రపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ తరపున భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

మూడోరోజు అయిన ఈరోజు శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం చేపట్టారు. బంధువులతోను, ఇతర ప్రముఖులతోను ఎన్ని రాయబారాలు నడిపినా షర్మిళ తన దారికి రాకపోవడంతో ఇక ఆమెపై ఆశలు వదలుకున్న జగన్‌ అండ్‌ కో తనదైన దూకుడు చూపిస్తున్న షర్మిళ వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రం చేపట్టారు.

ఈ క్రమంలోనే వైసీపీ సోషల్‌ మీడియా శ్రేణులు ఆమెపై తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు సాక్షి పేపర్‌లో ఆమెను ‘మొరుసుపల్లి షర్మిళాశాస్త్రి’ అంటూ హెడ్డింగ్‌లో పేర్కొనటం విపరీతంగా ట్రోల్‌ అవుతోంది.

‘మొరుసుపల్లి’ అనేది షర్మిళ భర్త అనిల్‌ ఇంటిపేరు. ఆయన స్వతహాగా బ్రాహ్మణుడు. దీంతో వైసీపీ కిందిస్థాయి కార్యకర్తల స్థాయికి దిగజారిపోయిన సాక్షి పత్రిక వారిలానే తానూ డీ గ్రేడ్‌ వార్తలు రాయడం ప్రారంభించింది.

సాక్షి పత్రికలో షర్మిళకు కూడా వాటా ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి మరీ రాస్తున్న ఈ వార్తల వల్ల వైసీపీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రాతల వల్ల జగన్‌కు నష్టం తప్ప, లాభం లేదని, అనవసరం ఆయనకు ఇంకా ప్రజల్ని దూరం చేయడమే ఈ వార్తల అంతిమ విధిగా మారుతుందని అంటున్నారు.