రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్న ఫ్యాన్సీ నంబర్లు

0
354
fancy numbers

హైదరాబాద్ నగరంలో ఫ్యాన్సీ బండి నెంబర్ల జోరు విపరీతంగా పెరిగింది. సినీ సెలెబ్రిటీలు ఇలాంటి ఫ్యాన్సీ నంబర్ల కోసం ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా ఖర్చుకి వెనకాడకుండా ఫ్యాన్సీ బండి నంబర్ల కోసం పోటీ పడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కేవలం ఈ ఒక్క ఏడాది లోనే ఫ్యాన్సీ నంబర్ల ద్వారా దాదాపుగా 50 కోట్ల రూపాయిల వరకు కలెక్ట్ అయ్యాయని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తారట. మంచి కారు కొనడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా ఫ్యాన్సీ నెంబర్ లేకపోతే కార్ కొని వేస్ట్ అని కొంతమంది అభిప్రాయం.

fancy numbers

పెళ్లైన మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడడానికి కారణాలు

అందుకే ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు లక్షలు పోస్తున్నారు. కొన్ని సార్లు అయితే బండి ధర కంటే.. ఫ్యాన్సీ నంబర్ కోసం పెట్టిన ఖర్చే అధికంగా ఉంటుంది కూడా. కొంతమంది ఈ ఫ్యాన్సీ నంబర్స్ ని సెంటిమెంట్‌ కోసం, లేదా జాతక బలం ప్రకారంగా తీసుకోవడం వంటివి చేస్తుంటారు.

ఇందులో ప్రముఖ సెలబ్రిటీలతో పాటు సంపన్న వర్గాల వారు ఉంటారు. ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఒక్కరోజే ఖైర‌తాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసింది, కేవలం ఒక్క రోజులోనే అరకోటి రూపాయిలు వాచినట్టు సమాచారం.

రవాణా శాఖ ఇటువంటి ఫ్యాన్సీ నెంబర్లను ప్రతి ముడు నెలలకు వేలంపాటలో ఉంచుతుంది. ప్రతి సిరీస్ లోనూ ఇలా ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో ఉంచుతారు. దీంతో ఫ్యాన్సీ నెంబర్లకు ఎప్పుడూ క్రేజ్ కొనసాగుతోందని తాజాగా ఖైరతాబాద్‌లోని RTA ఆఫీసులోని వేలం మరోసారి నిరూపించింది.

వాహనదారులు అభిరుచిని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ క్యాష్ చేసుకోవడం లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.