వర్మకు బర్రెలక్క షాక్‌..

0
259
case filed-on ram gopal varma for comments on barrelakka

రామ్‌గోపాల్‌ వర్మ.. దేశం గర్వించే మంచి టెక్నీషియన్‌. కానీ అది ఒకప్పుడు. ప్రస్తుతం పోర్న్‌ఫిలింస్‌ తీస్తూ తన స్థాయిని తానే పాతాళానికి తొక్కేసుకున్న వ్యక్తి.

క్రియేటివిటీ ఓవర్‌ అయిపోయి బుర్ర నిండా చెత్తను చేర్చుకున్న వర్మ ఇటీవల కాలంలో అనవసర వివాదాల జోలికి వెళ్లిడానికి అలవాటు పడ్డాడు. చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని జగన్‌రెడ్డితో చేతులు కలిపి తీర్చుకుంటుంటాడు.

ఆ మధ్య లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అని, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌గా సినిమాలు తీశాడు.

case filed-on ram gopal varma for comments on barrelakka

బుర్ర ఉన్నోడు ఎవడైనా నిన్న చంపాలని అనుకోడు అంటూ రామ్ గోపాల్ వర్మ పై సెటైర్లు వేసిన నాగబాబు!.

తాజాగా ‘వ్యూహం’ పేరుతో ఓ వివాదాస్పద సినిమా తీసి, దాని విడుదల కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఈ సినిమాకు సెన్సార్‌ వారు సర్టిఫికెట్‌ను ఇవ్వటానికి నిరాకరిస్తే..

దావూద్‌ ఇబ్రహీంతో ఫోన్‌ చేయించుకుని సర్టిఫికెట్‌ తెచ్చుకున్నాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో తమ కుటుంబ, పార్టీకి సంబంధించిన పరువును తీసే విధంగా వర్మ సీన్‌లను క్రియేట్‌ చేశాడు అంటూ నారా లోకేష్‌ కోర్టుకు కూడా వెళ్లాడు.

దీంతో ఈరోజు(29న) విడుదల కావాల్సిన ‘వ్యూహం’ విడుదల ఆగిపోయింది. ఈ కేసును తెలంగాణ హైకోర్ట్‌ జనవరి 11కు వాయిదా వేసింది. అంటే 11న విచారణ చేపడతారు అంతే. విడుదల ఎప్పుడనేది కోర్టు తీర్పును బట్టి ఉంటుంది.

ఇదిలా ఉంటే అందరి విషయాల్లోనూ వేలుపెట్టి తిట్టుంచుకునే వర్మకు ఇప్పుడు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే కంటెస్టెంట్‌ బర్రెలక్క అలియాస్‌ శిరీష షాక్‌ ఇచ్చింది.

విజయవాడలో నిర్వహించిన వ్యూహం సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో వర్మ బర్రెలక్కను ఉద్దేశించి.. ఊరు పేరులేని బర్రెలక్క ఫేమస్‌ అయిపోయింది. బర్రెలక్క మాటలు ఆమె బర్రెలు వింటాయి.

అందుకే ఆమెను బర్రెలక్క అంటారు.. అంటూ నోటి దూలకొద్దీ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలను అవమానంగా భావించిన శిరీష తన లాయర్‌ ద్వారా తెలంగాణ మహిళా కమిషన్‌లో ఒక పిటీషన్‌ దాఖలు చేసింది.

దీంతో వర్మ హాయిగా సినిమాలు చేసుకోక అనవసరంగా వివాదాల జోలికి వెళ్లి కెరీర్‌ను, పేరు, ప్రతిష్ఠలను నాశనం చేసుకున్నారని సినిమా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.