కొత్త సిటీ నిర్మాణంకి నడుం బిగించిన రేవంత్ రెడ్డి

0
431
revanth reddy hyderabad

మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని నగరాలకంటే బాగా అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉందా అంటే అది హైదరాబాద్ అనే చెప్పాలి. అన్నీ రంగాలలోను హైదరాబాద్ సిటీ అద్భుతంగా డెవలప్ అయ్యింది. ముఖ్యంగా ఐటీ రంగం లో అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్ కి రావాల్సిందే.

ఈ సిటీ లో డబ్బు ఉన్నవాళ్ళతో పాటుగా, మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా బ్రతికేయొచ్చు. ఇలా అందరికీ సౌకర్యంగా ఉండే సిటీ దేశం లో ఎక్కడా కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే హైదరాబాద్ నగరం చంద్రబాబు నాయుడు హయం లో బాగా అభివృద్ధి చెందింది.

ఇది కాదు అనలేని నిజం. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీ అభివృద్ధి విషయం లో ఇండియాలోనే టాప్ 2 గా నిల్చింది. ముఖ్యంగా ఐటీ రంగం లో ఎవ్వరూ దగ్గర్లో కూడా రాలేని రేంజ్ కి చేరుకుంది.

revanth reddy hyderabad

మంత్రులు కాని.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో అభివృద్ధి చేసింది కాబట్టే ఈ అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ వరకు క్లీన్ స్వీప్ చేసింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హయాం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హైదరాబాద్ లాంటి మరో సుందరమైన సిటీ ని నిర్మించాలనే కోరిక పుట్టింది.

హైదరాబాద్ నగర శివార్లలోని కందుకూరు వద్ద ఫార్మా సిటీ నిర్మాణానికి సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్‌ షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌ ఇటీవల ఆదేశించారు.

ఇది ఇలా ఉండగా గతం లో రంగారెడ్డి జిల్లా లోని యాచారం, కడ్తాల్ , కందుకూరు మండలాల పరిధిలో 19 వేల ఎకరాల విస్తీర్ణం లో ఫార్మా సిటీ ని నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయం ని వెనక్కి తీసుకొని ఆ స్థానం లో టౌన్ షిప్ ని నిర్మించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.

మితమైన బడ్జెట్ లోనే అత్యంత సుందరంగా హైదరాబాద్ లో ఉన్నన్ని సౌకర్యాలు మొత్తం ఈ నాల్గవ సిటీ లో ఉండాలని రేవంత్ తన అధికారులకు ఆదేశాలు జారీ చేసాడు రేవంత్ రెడ్డి. మూడేళ్లలోపు ఈ సిటీ నిర్మాణం ని ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారట.