బీఆర్‌ఎస్‌ నెత్తిన పడిన మేడిగడ్డ పిడుగు?

0
289
brs medigadda

మొత్తానికి అనుకున్నంతా అయ్యింది.. తానేది తలిస్తే దైవం కూడా అదే తలవాలి అన్నట్లు వ్యవహరించిన దొరల పాలనలో జరిగిన అవకవతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోయిన బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు జారిపోతారేమోననే శంఖ ఓవైపు నుంచి తరుముతుండగా, మరోవైపు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమ పాలనలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి ఏ మార్గంలో ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియక కేసీఆర్‌ అండ్‌ కో టెన్షన్‌ పడుతుంటే తాజాగా మరో పిడుగు బీఆర్‌ఎస్‌ నెత్తిన పడిరది.

విషయంలోకి వెళితే.. ప్రపంచ అద్భుతంగా, తన మానసపుత్రికగా కేసీఆర్‌ పేర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ`అన్నారం బ్యారేజీ కుంగిపోవడం అందరికీ తెలిసిందే. కేసీఆర్‌ ఓ సందర్భంలో ప్రెస్‌మీట్‌లో స్వయంగా తాను తన మొదడు చుక్కచుక్క ఖర్చుపెట్టి కాళేశ్వరం కట్టానని చెప్పారు. అదే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ వంతెన నాలుగేళ్లు తిరక్కుండానే కుంగిపోయింది. అదీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే.

brs medigadda

కేసీఆర్‌ను చెప్పిమరీ దెబ్బకొట్టిన జర్నలిస్ట్‌లు

దీంతో ప్రతిపక్షాలు కాళేశ్వరం కేసీఆర్‌ జేబు సంస్థగా మారిందని, ఏటీఎంలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరు చెప్పి దోచుకున్నారని, ఈ కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం లోపభూయిష్టంగా మారి కుంగిపోయిందని ఆరోపణలు చేశారు. అనుకోని ఈ పరిణామానికి ఉక్కిరిబిక్కిరి అయిన కేసీఆర్‌ అండ్‌ కో మేడిగడ్డ సందర్శనను అడ్డుకుని దానికి ఇరువైపులా గేట్లు బిగించారు.

అలాగే ఒప్పందంలో భాగంగా ఇంకా సమయం ఉండటంతో మేడిగడ్డ రిపేరు పనులు నిర్మాణ సంస్థ తన ఖర్చుతోనే నిర్వహిస్తుందని పేర్కొని ఈ గండం నుంచి గట్టెక్కాలని ప్రయత్నించారు.

తాజాగా నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి మేడిగడ్డ నిర్మాణ రిపేర్‌ల ఖర్చు ప్రభుత్వమే భరించాలని, ప్రాజెక్ట్‌ కుంగిన భాగాన్ని రిపేర్‌ చేయాలంటే ముందు ఆ ప్రాంతానికి నీరు చేరకుండా చేయాలని, ఇందుకోసం 55 కోట్ల 75 లక్షల రూపాయలతో స్పిల్‌ వేను నిర్మించాలని, ఆ తర్వాత రిపేర్‌ల కోసం మరో 500 కోట్లు ఖర్చు అవుతాయని వీటిని కూడా ప్రభుత్వమే భరిస్తే తాము ఆ పనులు చేపట్టటానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌కు లేఖ రాసింది.

ఇప్పుడు ఇది బీఆర్‌ఎస్‌ నెత్తిగా పిడుగుపడినట్లు అయింది. ఎందుకంటే మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాల్లో ఏదో మతలబు జరిగి ఉంటుందని, ఆ ధైర్యంతోనే ఎల్‌ అండ్‌ టి ఇలా లేఖ రాసిందని, లేకపోతే అంత ఆషామాషీగా ఇలా లేఖ రాసి ఉండేదని కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ తీగ లాగితే అసలు డొంక కదులుతుందేమోనని బీఆర్‌ఎస్‌ చీఫ్‌ తల పట్టుకుంటున్నారు.