విరుచుకు పడుతున్న వర్షాలు..

0
1838

పాకిస్థాన్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పాకిస్తాన్‌ అతలాకుతలం అయిపోతుంది. ఎక్కడి వారు అక్కడ స్తంభించి పోయారు. ఇప్పటికే ఈ వరద కారణంగా 300 పై చిలుకు చిన్నారులతో సహా సుమారుగా 936 మంది మరణించినట్లు తెలుస్తుంది. దీనితో పాకిస్థాన్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇంకా ఈ వరదలకు 3 కోట్ల కు పైగా నిరాశ్రయులు అయినట్లు తెలుస్తుంది.

166 మిల్లీ మీటర్లు వర్షం

ఇక ఇప్పటికే పాకిస్థాన్ లో ఈ ఆగష్టు దాదాపుగా 166 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. సగటున చూస్తే 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనితో యుద్ధ ప్రాదిపకిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తుంది. దేశంలో వంతెనలు కూడా కొట్టుకు పోయాయని అధికారులు చెబుతున్నారు.