అమ్మాయి బ్రేక్ అప్ చెప్పిందని

0
1872

యువతకి ఈ మధ్య కాలంలో తమ శరీర ఆకృతిపై మోజు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తమ శరీరాన్ని అందంగా ఉంచుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ పార్టనర్ కూడా అందంగా నాజూకుగా ఉండాలని కోరుకుంటున్నారు. తాజగా జరిగిన ఓ ఘటన చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడమే కాయం. తన బాయ్ ఫ్రెండ్ రోజు రోజుకి లావు అవుతున్నాడని ఓ అమ్మాయి బ్రేక్ అప్ చెప్పింది. దీనితో అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది.

బ్రేకప్‌ చెప్పే సమయానికి 139 కిలోలు

వెంటనే వెళ్లి జిమ్ లో జాయిన్ అయ్యాడు. జిమ్ లో ఎంతో కష్ట పడ్డాడు. చివరికి అనుకున్నది సాధించి 70 కిలోలు తగ్గి.. సూపర్ అనిపించుకున్నాడు. భారీ ఖాయం నుండి కండల వీరుడిలా మారి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ప్రియురాలు బ్రేకప్‌ చెప్పే సమయానికి 139 కిలోలు ఉండగా.. సరిగ్గా 18 నెలలు తరువాత కండల వీరుడిలా 74 కిలోలకి చేరాడు. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.