ఇంట్రెస్టింగ్ గా రేవంత్ రెడ్డి బయోపిక్..!

0
341
revanth reddy biopic

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తన మార్కు పాలనతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి, గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ఈయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని గూగుల్ లో నెటిజెన్స్ తెగ వెతికేస్తున్నారు.

కొంతమంది అయితే ఆయన స్టోరీ ని తెలుసుకొని, చాలా సినిమాటిక్ గా ఉందే, ఎవరైనా బయోపిక్ గా సినిమా తీస్తే బాగుండును అని అనుకున్నారు. అంతలా ఆకట్టుకునేలా రేవంత్ రెడ్డి బయోపిక్ లో ఏముందో ఒకసారి చూద్దాము.

రేవంత్ రెడ్డి కాలేజీ రోజుల్లో మంచి మెరిట్ స్టూడెంట్ అట. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దశరథరెడ్డి ఈ విషయాన్నీ చెప్తూ రేవంత్ రెడ్డి లో ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలిసేలా చేసాడు. అప్పట్లో రేవంత్ రెడ్డి కి 8 వ రాంక్ వచ్చిన తర్వాత కూడా ఆయనకి కాలేజీ లో సీట్ రాలేదట.

revanth reddy biopic

కేసీఆర్‌ అలా ఫిక్స్‌ అయిపోయారా?.

అప్పటి నుండే ఆయనలో తిరుగుబాటు తత్త్వం ఉండేది అని చెప్పుకొచ్చాడు. అలాగే రేవంత్ రెడ్డి సంఘ్ లో ఉన్నప్పుడు జాగృతి పత్రికకు జర్నలిస్ట్ గా కూడా పనిచేసాడట. రేవంత్ రెడ్డి లో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మన జర్నలిజం కి సంబంధించిన వాడే అని మురిసిపోతున్నారు.

అలాగే యూత్ లీడర్ గా కొనసాగిన రేవంత్ రెడ్డి అప్పట్లో ఎన్నో ఉద్యమాలు చేసాడు. తెలుగు దేశం పార్టీ లో ఎన్నో కీలక పదవులను బాధ్యతగా నిర్వహించి చంద్రబాబు నాయుడు కి అత్యంత సన్నిహితుడిగా మారిన రేవంత్, నేడు కాంగ్రెస్ పార్టీ లో చేరి ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి కూర్చుకున్నాడు.

ఇంతకంటే విజయవంతమైన జర్నీ ఎవరికీ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కి ఉన్న దూకుడు ని చూస్తూ ఉంటే మనకి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తున్నాడు. ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుత్వం స్థాపించిన రెండు వారాల్లోనే తన మార్క్ పాలన ఏంటో జనాలకు అర్థం అయ్యేలా చేసాడు.

ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు కూడా సిద్ధం అవుతూ, మరోసారి కాంగ్రెస్ పార్టీ కి తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కేంద్రం లో చక్రం తిప్పాలంటే కచ్చితంగా అత్యధిక ఎంపీ స్థానాలు కావాలి. మరి కాంగ్రెస్ పార్టీ కి అవసరమైన స్థానాలను తెలంగాణ నుండి రప్పిస్తాడో లేదో చూడాలి.