బోడికొండ శ్రీరామ తీర్ధం ఎపిసోడ్‌లో ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌

0
405

ఈరోజు ఉదయం నుంచీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య విజయనగరం జిల్లా బోడికొండ రామతీర్ధం రామాలయం వద్ద చోటు చేసుకున్న ఎపిసోడ్‌కు సాయంత్రం ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. దీంతో ఉదయం నుంచీ హైడ్రామా నడపడం వెనుక ఉన్న కారణం బైట పడిరది. ఉదయం నుంచీ రామతీర్ధం ఆయ పరిసరాలు నినాదాల హోరుతో దద్దరిల్లాయి. అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షాలు హిందూ సంఘాలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. ఉదయం ఆకస్మికంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్ధం కొండ వద్దకు చేరుకున్నారు.

చంద్రబాబు నాయుడు చేరుకోనుండడంతో

అప్పటికే అక్కడ టీడీపీ, బీజేపీ, ఇతర హిందూ సంఘాల నాయకులు చేరుకుని ఉండడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసుల చర్యలు చేపట్టారు. బోడికొండకు చేరిన విజయసాయిరెడ్డి మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్నారు. ఆయనకు అర్చకులు తీర్ధ, ప్రసాదాు అందజేశారు. మరోవైపు అదే సమయానికి అక్కడకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనుండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు

కొండ దిగువకు వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీరామునికి జరిగిన ఘోర అవమానానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్‌ బాధ్యత ఉందని పేర్కొంటూ అక్కడి ఉద్రిక్త పరిస్థితిని మరింత రెచ్చగొట్టారు. దీంతో ఆయన కారుపై టీడీపీ శ్రేణులు రాళ్లు, చెప్పు విసరడంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు చంద్రబాబు కొండపైకి చేరుకున్నారు. అయితే చంద్రబాబు రాకకు కొద్ది సేపటి ముందే గుడికి తాళాలు వేసేశారు. దీంతో చంద్రబాబు ధ్వంసానికి గురైన రాముని విగ్రహం పరిశీలించడానికి కుదరలేదు. ఈ విషయమై చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.