మహేష్‌తో 3 చిత్రాలు చేసిన ఏకైక దర్శకుడు.. 4కు సిద్ధమౌతున్నాడా?

0
384

‘రాజకుమారుడు’ ఘన విజయంతో స్టార్‌ హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు తనకూ ఉన్నాయని, భవిష్యత్తులో తాను సూపర్‌స్టార్‌ అవుతానని చెప్పకనే చెప్పారు మహేష్‌బాబు. తొలి సినిమా ఘన విజయం సాధించినా.. ఆ తర్వాత చేసిన సినిమాలు నిరాశపరచినా… మురారితో నటుడిగా తానేంటో ప్రూవ్‌ చేసుకున్నారు మహేష్‌. అయితే మహేష్‌బాబు సినిమాకు సేబులిటీ తెచ్చింది మాత్రం ‘ఒక్కడు’ చిత్రం. గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మహేష్‌ కెరీర్‌లో కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌. అక్కడి నుంచి అతని కెరీర్‌ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత యం.యస్‌.రాజు నిర్మించారు. ఒక్కడు సందర్భంగా గుణశేఖర్‌తో ఏర్పడిన అనుబంధాన్ని పురస్కరించుకుని అతనితోనే ‘అర్జున్‌’, ‘సైనికుడు’ చిత్రాలు చేశాడు. మహేష్‌తో మూడు చిత్రాలకు పనిచేసిన దర్శకుడు గుణశేఖర్‌ ఒక్కడే. చాలా కాలంగా వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి’లో అు్ల అర్జున్‌ చేసిన పాత్రకు మొదట మహేష్‌నే అనుకున్నాడు గుణ. కానీ ఎందుకో సెట్‌ కాలేదు.

తాజాగా ‘ఒక్కడు’ నిర్మాత యం.యస్‌.రాజు ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌తో మళ్లీ మహేష్‌`గుణశేఖర్‌ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుమంత్‌ ఆర్ట్స్‌ అధినేతగా, స్టార్‌ ప్రొడ్యూసర్‌గా అందరికీ సుపరిచితులైన యం.యస్‌.రాజు గతంలో ‘వాన’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీహరి’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ‘ఒక్కడు’ సీక్వెల్‌ ప్రస్తావన వచ్చింది. దీనికి స్పందించిన ఆయన ‘‘ఒక్కడు సీక్వెల్‌ తప్పకుండా వస్తుంది. కానీ సరైన టైం సెట్‌ అవ్వాలి. అన్నీ కుదిరితే మహేష్‌తో సీక్వెల్‌ తెరకెక్కిస్తా.