జరుగుతున్న నష్టం అర్ధమవుతోందా జగన్‌మోహన్‌రెడ్డి గారూ

    0
    446

    ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు పెల్లుబికితే జరిగే నష్టం భారీగా ఉంటుంది. రాజకీయంగా అధికార పార్టీకి జరిగే నష్టం కన్నా పరిస్థితులు అదుపుతప్పితే అల్లర్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఆచి తూచి అడుగు వేయాలి. పైగా రాష్ట్ర నాయకుడి మతం కాని మతంపై వివాదాలు రేగితే మరింత జాగ్రత్తగా వ్యవహరించి పరిస్థితులను చక్కదిద్దు కోవాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా పెద్దగా సీరియస్‌గా స్పందంచడం లేదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

    ఆయా ఆలయా ల పై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై విపక్ష టీడీపీ, బీజేపీ వంటి పార్టీ లు వ్యక్తం చేస్తున్న ఆందోళను రాజకీయ కోణంలో చూసినప్పటికీ సామాన్య ప్రజల మనసుల్లో మాత్రం పదే పదే ఇటువంటి సంఘటనలు జరగడంతో క్రమంగా వైసీపీపై వ్యతిరేక ముద్ర పడుతోంది. దీనికి తోడు అంతర్వేది రథం దగ్ధం, విజయవాడలో అమ్మవారి రథంపై ఉండాల్సిన సింహాల చోరీ విషయంలో మంత్రి కొడాలి నాని అవహేళనగా మాట్లాడటం కూడా హిందువుల్లో వ్యతిరేక భావం ఏర్పడేలా చేస్తోంది. ఇప్పటి వరకూ పలు సంఘటను జరిగినప్పటికీ అంతు చూస్తాం.. తాటతీస్తాం.. ఎవ్వరినీ వదలం .. వంటి మాటలు తప్ప అసలైన నిందితులను పట్టుకోవడంలో ఖచ్చితంగా ప్రభుత్వం విఫ లం అవుతున్నది. ఎంత సేపూ ఈ ఘటన వెనుక విపక్ష టీడీపీ ఉందని మాటి మాటికీ ఆరోపించే మంత్రులు.

    మరి వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోతోంది. సున్నితమైన ఈ అంశంలో జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే భావన క్రమంగా పెరుగుతోంది.
    తాజాగా బోడికొండ రాముల వారి కొండ దగ్గర జరుగుతున్న రాజకీయ రచ్చను చూసి ప్రజులు విస్తు పోతున్నారు. దీనికి తోడు ఎప్పుడూ లేని విధంగా ఇటీవల కా లంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ దేవుడి గుళ్లల్లో ప్రమాణాలు చేయడం అనే కొత్త సంస్కృతిని మొదలు పెట్టాయి.