నా భర్తకి ఈత రాదు.. నీళ్లలోకి తోసి చంపేయ్

  0
  2619

  పెళ్లి అయి ఇరవై ఏళ్ళు గడిచినా ఆ భార్యకు ఇంకా పాడు బుద్ది పోలేదు. క్షణికానందం కోసం భర్త ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. తన అన్న కుమారుడు తో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తని చంపి నాటకం వేసింది. ఆ వివరాలలోకి వెళితే నంద్యాల లోని మహానంది మండలం తమ్మడపల్లె కి చెందిన డక్కా క్రిష్ణయ్య (40), జయలక్ష్మి (37)లకు పెళ్లి జరిగి ఇరవై ఏళ్ళు గడిచింది. డక్కా క్రిష్ణయ్య ఓ రైతు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిచేవాడు.

  అన్న కుమారుడుతో చనువు

  అయితే జయలక్ష్మి తన అన్న కుమారుడు డక్కా చింతలయ్యతో చనువుగా ఉండేది. ఆ తరువాత అదే వివాహేతర సంబంధంగా మారింది. వీరిపై అనుమానం వచ్చిన క్రిష్ణయ్య.. వారిని మందలించాడు. అయితే క్రిష్ణయ్య మాట పెడ చెవిన పెట్టిన జయలక్షిమి.. తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు. ఈ విషయంపై కొన్నాళ్ల పాటు క్రిష్ణయ్య హెచ్చరించాడు. అయితే తన ఆనందానికి అడ్డు వస్తున్నాడని భర్తని చంపాలని ప్లాన్ వేసింది జయలక్ష్మి.

  నీళ్ళలోకి తోసి చంపాలని సలహా

  ప్లాన్ లో భాగంగా తన భర్తకు ఈత రాదనీ .. తన భర్తని నీళ్ళలోకి తోసి చంపాలని చింతలయ్యకు సలహా ఇచ్చింది జయలక్ష్మి. చింతలయ్య తన స్నేహితులతో కలసి క్రిష్ణయ్య ని చంపని ప్లాన్ వేసుకున్నాడు. ఓ రోజు సాయంత్రం నందిపల్లె గ్రామ శివారులోని పాలేరు వాగు వంతెన పై వెళుతున్నాడు క్రిష్ణయ్య. బైక్‌మీద వెళ్తున్న క్రిష్ణయ్యను చింతలయ్య ఆపి మాట్లాడుతున్నాడు. ప్లాన్ లో భాగంగా చింతలయ్య స్నేహితులు వచ్చి కాళ్లు, చేతులు పట్టుకొని నీటిలోకి విసిరేశారు.

  తమదైన శైలిలో విచారణ

  ఇక ఆ తరువాత ఏమి తెలియదన్నట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విచారణలో జయలక్ష్మి, చింతలయ్య ప్రవర్తన పట్ల పోలీసులకు అనుమానం వచ్చింది. చింతలయ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిజం బయటకు వచ్చింది. క్రిష్ణయ్య ని తామే హత్య చేసినట్లు చింతలయ్య ఒప్పుకున్నాడు. విషయం బయటికి తెలిసిందని జయలక్ష్మి పరార్ అయింది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.