రా.. వచ్చి నా భర్తని వేసేయ్.. ప్రియుడికి ఫోన్

    0
    2959

    వివాహేతర సంబంధాలు కాపురాలను కూలుస్తున్న ఘటనలు ఎప్పటినుండో జరుగుతున్నవే. అందులో భాగంగా అలంటి ఘటనే నల్గొండ లో చోటు చేసుకుంది. తమ వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. నీలగిరి మున్సిపాలిటీ పరిధి పానగల్‌ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలలోకి వెళితే పానగల్‌ కి చెందిన వెంకన్న (40) బోరు బావుల తవ్వకం పనులు చేస్తూ ఉండేవాడు.

    లింగస్వామి అని యువకుడితో పరిచయం

    ఇతడికి ఒక భార్య, కూతురు, కొడుకు, ఉన్నారు. భార్య సుజాత పత్తి కూలి మేస్త్రీగా పని చేస్తుంది. అయితే పత్తి కూలీలను తీసుకుపోయే క్రమంలో చెర్వుగట్టుకు చెందిన లింగస్వామి అని యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహిత సంబంధానికి దారి తీసింది. దీనితో సుజాత లింగస్వామి తో మూడు నెలల క్రితం లేచి పోయింది. వీరిపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు వారిని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

    రా.. వచ్చి నా భర్తని వేసేయ్

    అయితే కౌన్సిలింగ్‌ కి ఏమాత్రం తలొగ్గకుండా తమ వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. అదును కోసం ఎదురు చూస్తూ ఉంది. ఓ రోజు భర్త బాగా తాగి పడుకొని నిద్రపోతున్నాడు. ఇదే అదునని భావించిన భార్య ప్రియుడికి ఫోన్ చేసి.. ‘రా.. వచ్చి నా భర్తని వేసేయ్’ అని చెప్పింది.

    మత్తులో చనిపోయాడని నాటకం

    లింగస్వామి వచ్చాక మద్యం మత్తులో ఉన్న భర్తని ఇద్దరూ కలసి దిండుతో అదిమిపట్టి, గొంతునులిమి ఊపిరి ఆడకుండా చంపేశారు. ప్రియుడిని పంపించి.. తన భర్త మద్యం మత్తులో చనిపోయాడని నాటకం మొదలు పెట్టింది సుజాత. వెంకన్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుజాతను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం బయటికి వచ్చింది.