పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది.. సరిగ్గా నెల రోజుల్లో

    0
    9630

    ప్రేమ పెళ్లి తప్పు కాకపోయినా.. అది ఒక్కోసారి బెడిసికొడుతుంది. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి ఓ యువతి తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఇంకా నెల రోజులు కూడా కాకముందే అతడి నిజస్వరూపం బయట పడింది. ఆ వివరాలలోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో దర్శి మండలం ఈ ఘటన జరిగింది. మండలంలోని పోతవరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం స్థానికంగా కలలకం రేపింది. వారికి వెళ్లి జరిగి ఇంకా నెల రోజులు కూడా కాలేదు.

    పెళ్లి జరిగిన రోజు నుండే

    గత నెల 18 వ తేదీన సాయికుమార్‌, పావని లు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన రోజు నుండే వీరి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఏమి జరిగిందో ఏమో గానీ .. భర్త వేధిస్తున్నాడని పావని తన తల్లి తండ్రుల వద్దకు వెళ్ళిపోయింది. దీనితో కోపోద్రికుడైన భర్త సాయికుమార్‌.. తన భార్య పావని పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసాడు. దాడి చేసిన వెంటనే భర్త సాయికుమార్‌ పరార్ అయ్యాడు.

    సాయికుమార్‌ కోసం పోలీసులు గాలింపు

    పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు భర్త సాయికుమార్‌ కోసం గాలిస్తున్నారు. అసలు పెళ్లి జరిగిన నెల రోజుల్లో పావనిపై ఇంతలా దాడి చేయడానికి మరో కారణం ఏదైనా ఉందేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆమె తల్లి తండ్రులు నుండి, స్థానికులు నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు.