బ్రహ్మానందం ఆస్తుల రికార్డు.. గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం

  0
  2472

  సినిమా ఏదైనా అందులో బ్రహ్మానందం ఉంటె ఆ కిక్కే వేరు. బ్రహ్మానందం వేసే జోకులకు, అతడి నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. సినిమాలో హీరో ని కూడా డామినేట్ చేస్తూ ఉంటాడు ఈ అద్భుత నటుడు. అందుకే బ్రహ్మానందం ఇతరుల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటాడు. టాలీవుడ్ లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే నటుల్లో నెంబర్ వన్ కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.

  సోషల్‌మీడియాలో చర్చ

  బ్రహ్మానందం లేకుంటే ఆ సినిమా లో వెలితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇతర నటులు ఎంత మంది ఉన్నా బ్రహ్మానందం ఉంటె వచ్చే కిక్కు వేరని చెప్పాల్సిన పని లేదు. గత కొంత కాలంగా ఆయన సినిమాలలో నటించడం తగ్గించినా సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ తన గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.

  ఇతర నటులకన్నా ఎక్కువ రెమ్యునరేషన్‌

  సినీ ఇండస్ట్రీ లో దాదాపు 1250కి పైగా సినిమాల్లో నటించిన ఈ కామెడి కెరటానికి 2010 లో గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఇకపోతే ఈ మధ్య సోషల్ మీడియా లో బ్రహ్మానందం ఆస్తుల విలువ బాగా చర్చకు వస్తుంది. 1250కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతర నటులకన్నా ఎక్కువగా రెమ్యునరేషన్‌ తీసుకుంటాడు. ఈ లెక్కన ఈ కామెడీ కింగ్ బాగానే సంపాదించి ఉంటాడన్న ఊహాగానాలు వస్తున్నాయి.

  రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టిబడి

  ఇక ఆస్తుల విషయానికి వస్తే ఈ నవ్వుల రారాజు డబ్బులు పొడుపుగానే ఖర్చు చేస్తాడని ఇండస్ట్రీ లో టాక్ ఉంది. ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టిబడి పెట్టినట్లు తెలుస్తుంది. ఇతగాడి ఆస్తుల విలువ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా ఉంది.