బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నేనే

0
333
bigg boss sivaji

ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ హౌస్ లోనే కాదు, బిగ్ బాస్ హిస్టరీ లోనే తనదైన మార్కుని ఏర్పాటు చేసుకున్న కంటెస్టెంట్ శివాజీ. ఈయన లేకపోతే ఈ సీజన్ లేదు అనేంత రేంజ్ లో అద్భుతంగా ఆట ఆడాడు. ఎక్కువగా కందకి పని చెప్పకుండా, బుద్ధికి పని చెప్పి సోఫా మీద కూర్చొని షో మొత్తాన్ని నడిపించదువు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే ఆయన తానూ గెలవడం కంటే కూడా పల్లవి ప్రశాంత్ గెలిచేందుకే ఆడాడు. అందుకే విన్నర్ కాలేకపోయాడు, కనీసం రన్నర్ కూడా కాలేకపోయాడు. టాప్ 3 కంటెస్టెంట్ గా ఈ సీజన్ లో మిగిలిపోయాడు. అంత బాగానే ఉంటుంది కానీ శివాజీ అమర్ దీప్ ని మొదటి వారం నుండి టార్గెట్ చేస్తూ రావడం మాత్రం ఎవరికీ నచ్చలేదు.

bigg boss sivaji

రూ.10 తో పది లక్షలు కొల్లగొట్టిన బాలయ్య

ఇది కూడా ఆయన్ని టైటిల్ రేస్ నుండి తప్పించేలా చేసింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే అందరిలాగానే శివాజీ కూడా బజ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ గీతూ రాయల్ అడిగిన ప్రశ్నలకు శివాజీ చాలా దీటుగా స్పందించాడు.

ఆయనతో మాట్లాడుతూ ‘ఇన్ని వారాలు హౌస్ లో ఉంటానని మీరు అనుకున్నారా ‘ అని అడగగా, ‘అనుకోవడం ఏమిటి..నేనే టైటిల్ విన్నర్, నాకు తెలుసు’ అని అంటాడు. అమర్ దీప్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని మీరు అంటున్నారు.

మీరు కూడా ప్రశాంత్ మరియు యావర్ తో గ్రూప్ గేమ్ ఆడారు కదా అని అనగా, అప్పుడు శివాజీ ‘ఎవరెవరు గ్రూప్ గేమ్స్ ఆడారో జనం చూడలేదా?’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక అమర్ దీప్ ని మీరు మొదటి వారం నుండి టార్గెట్ చేస్తున్నట్టుగా చూస్తున్న ఆడియన్స్ అందరికీ అనిపించింది.

దీనికి మీరు ఏమంటారు అని యాంకర్ అడగగా దానికి శివాజీ సమాధానం చెప్తూ ‘హౌస్ లో ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పటికీ చెప్తున్నా అమర్ గాడు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్’ అని అంటాడు.

అప్పుడు అంత క్లోజ్ అయ్యినప్పుడు కెప్టెన్ ని కాకుండా చెయ్యడానికి ఎందుకు అన్ని ప్లాన్స్ వేశారు అని అడగగా శివాజీ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.