అనిల్ రావిపూడి బయోగ్రఫీ

0
501

నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లు మనిషి జీవితానికి సక్సెస్ ఫెయిల్యూర్ రెండూ ఉంటాయి. మనిషి తాను ఎంచుకున్న రంగంలో మొదట్లో అయినా చివర్లో అయినా ఏదో ఒకదాన్ని తప్పకుండా ఎదుర్కోక తప్పదు. కానీ అనిల్ రావిపూడి విషయంలో ఇది కొంచెం భిన్నంగా ఉంది. అవేంటో చూద్దాం..

సక్సెస్ వెంటాడుతోంది

అనిల్ రావిపూడి డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ర్టీలో జక్కనకు ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ (పటాస్ టూ ఎఫ్ 3 వరకు) హిట్ చిత్రాలుగానే నిలిచాయి. ఇందులో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. లాభాల పరంగా కూడా ప్రొడ్యూసర్లకు అవి మంచి కాసులను కురిపించాయి. అపజయం ఎరుగని దర్శకుల జాబితాలో ఇప్పటి వరకూ నిలిచారు అనిల్ రావిపూడి.

అనిల్ ప్రస్థానం

అనిల్ రావిపూడి 23 నవంబర్, 1982లో జన్మించారు. దర్శకుడిగా అనిల్ రావిపూడి మొదటి చిత్రం ‘పటాస్’ ఇది 23 జనవరి, 2015లో రిలీజైంది. ఈ మూవీకి ముందు మూడేళ్లు ఆయన అసోసియేట్ డైరెక్టర్ గా బాగా శ్రయించారు. కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తూ పటాస్ తీశారు. ఇది అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా

నవదీప్ హీరోగా వచ్చిన చిత్రం ‘గౌతమ్ ఎస్సెస్సీ’ నుంచి గోపీచంద్ శంఖం, రాం ‘కందిరీగ’, మహేశ్ బాబు ‘ఆగడు’ తదితర చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు అనిల్. అప్పట్లో ఆయన పని చేసిన సినిమాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయట. కానీ ఆయన డైరెక్టర్ గా మారిన తర్వాత తీసిన సినిమాలు ఇప్పటి వరకూ ఏదీ ఫెయిల్ కాలేదు సరికదా.. సక్సెస్, బాక్సాఫీస్ హిట్లు సాధించారు.

రావిపూడి కలెక్షన్లు

అనిల్ తీసిన అన్ని సినిమాలు హిట్టయ్యాయి. భారీగా కలెక్షన్ల వరద కురిపించాయి. ఇందులో పటాస్ ను రూ. 9 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 21 కోట్ల గ్రాస్ సాధించింది. సాయి ధరమ్ తేజ్ తో తీసిన ‘సుప్రీమ్’ రూ. 24 కోట్లకు పైగా వసూలు చేసింది. తర్వాతి మూవీ ‘రాజా దిగ్రేట్’ రూ. 30 కోట్లకు పైగా రాబట్టింది. టాలీవుడ్ స్టార్ వెంకటేశ్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబోలో తీసిన మరో మూవీ ‘ఎఫ్-2’ ఇది రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసింది. 2019 సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటిపడి మరీ ఇంత భారీ కలెక్షన్లను దక్కించుకుంది. దీని తర్వాత మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా మంచి కలెక్షన్లనే సాధించింది. ఇక ఆయన తీసిన మూవీల్లో ఇప్పటి వరకూ చివరి చిత్రం ‘ఎఫ్-3’ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ కథతో నవ్వులు పూయించడంతో పాటు అదే స్థాయిలో బాక్సాఫీస్ హిట్ తో పాటు కలెక్షను రాబట్టాడు రావిపూడి ఈ చిత్రం రూ. 95.20 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.

ఆహా షోలో అలరించనున్న అనిల్

అనిల్ రావిపూడి ఏడేళ్లలో తీసిన ఆరు సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. ఆయన ఇప్పుడు ఓటీటీని కూడా పలకరించబోతున్నాడు. ఆహా స్ర్టీమింగ్ ఇటీవల ఒక ప్రొగ్రాం డిజైన్ చేసింది. దాని పేరు ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’. దీనిలో జడ్జి సీట్ ను అధిరోహించనున్నాడు రావిపూడి. హోస్ట్ లుగా సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి వ్యవహరించనున్నారు. ఇది ఆహాలో డిసెంబర్ 2వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. బహూషా అపజయం ఎరుగని డైరెక్టర్ అని ఈ షోకు ఎంపిక చేసినట్లున్నారు ఆహా యూనిట్.