యంగ్ హీరోయిన్ తో న్యూజిలాండ్ లో రాం చరణ్ ఎంజాయ్

0
225

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో ఒక మెగా ప్రాజెక్టు తెరకెక్కుతుందని అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఇటీవల న్యూజిలాండ్ కు వెళ్లింది. అక్కడ ఉన్న అందమైన లొకేషన్స్ లో ఒక పాటను చిత్రీకరిస్తున్నాట. షూటింగ్ భాగంగా గ్యాప్ దొరకడంతో రాంచరణ్, హీరోయిన్ కియారా అద్వానీతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

శంకర్-చరణ్ కాంబోలో

‘త్రిపుల్ ఆర్’ భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రాంచరణ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి మెగా సినిమా తీయబోతున్నారు. దీనికి ఆర్సీ 15 (RC15) అని పేరు కూడా పెట్టారు. వీరి కాంబోలో రాబోతున్న చిత్రానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. రాం చరణ్ ఇటీవల న్యూజిలాండ్ బయల్దేరుతో హైదరాబాద్ లోని ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన పిక్స్ ఆ సినిమా కోసమే అంటూ వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. RC 15 లో రాంచరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. హీరో, హీరోయిన్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ను అక్కడి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ శంకర్.

కియారాతో కలిసి పార్టీకి

చిత్రంలోని ఓ సాంగ్ షూటింగ్ కోసం వెళ్లిన చిత్ర యూనిట్ కాస్త ఫ్రీటైం దొరికితే అక్కడి ప్రదేశాలను వీక్షిస్తున్నారు. సాంగ్ షూట్ సమయంలో కాస్త సమయం దొరికినప్పుడు కియారా అద్వానీతో కలిసి రాం చరణ్ బయటకు వెళ్లారట. కియారాతో కలిసి రాంచరణ్ ఓ రెస్టారెంట్ లో బర్గర్ తిన్నారు. దీనికి సంబంధించి ఫొటోలను కియారా అద్వానీ సోషల్ మీడియా వేధికగా పోస్ట్ చేసింది. దీనిపై రామ్ చరణ్ భార్య ఉపాసన రియాక్టైంది. ఐ మిస్ యూ గైస్ అంటూ కామెంట్ పెట్టింది.

దిల్ రాజు స్పెషల్ ఫోకస్

‘శ్రీ వేంకటేశ్వర మూవీస్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ తారాగణంతో పాటు స్టార్ డైరెక్టర్ తో దీన్ని తెరకెక్కించనున్నరు. దీంతో ఆయన ఈ మూవీపై స్పెషల్ కేర్ పెడుతున్నట్లు తెలిసింది. రాంచరణ్ తో పాటు కియారా అద్వానీ, జయరాం, సునీళ్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇందులో రాం చరణ్ ఎలక్షన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. దీంతో ఆయన లుక్ పై మెగా అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారట చెర్రీ ఫ్యాన్స్.

భారీ యాక్షన్ సీక్వెన్స్

శంకర్ డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన ప్రతీ సినిమాలో ఒక్క సాంగ్, ఒక ఫైట్ టెక్నికల్ జోడించి తీస్తారు. ఇప్పటి యంగ్ డైరెక్టర్లకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు. గతంలో తక్కువ బడ్జెట్ తో సినిమాలు కంప్లీట్ చేసినా.. ప్రస్తుత జమానాకు అనుగుణంగా బడ్జెక్ కు రాజీ పడకుండా సినిమాలు తీస్తున్నారు శంకర్. ఇందులో భాగంగానే వచ్చిన మూవీస్ రోబో సీక్వెల్. రాం చరణ్ తో తీయబోయే ఈ చిత్రంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు శంకర్. ఇలాంటి సీక్వెన్స్ ఇప్పటికీ ఏ మూవీలో కూడా రాలేదంటూ పేర్కొంటున్నారు ఆయన. మూవీ క్లైమాక్స్ లో 20 నిమిషాల పాటు వచ్చే ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ. 20 కోట్లు వెచ్చించనున్నట్లు చిత్ర యూనిట్ చెప్తుంది. వీరి కాంబో అదిరిపోతుందని.. ఎప్పుడు మూవీని చూద్దామా అని ప్రేక్షకులు, చెర్రీ అభిమానులు ఎదురుచూస్తున్నారట.