కృష్ణ ఇంటిని మహేశ్ వదులుకోవాల్సిందేనా..?

0
1854

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కాలం చేశారు. ఆయన బతికున్న సమయంలో చాలా ఆస్తులను కూడ బెట్టారు. సుధీర్ఘ కాలం హీరోగా సాగిన కృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సనిమాలు ఉన్నాయి. పైసల విషయంలో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టే కృష్ణ ఆస్తులు చాలానే కూడ బెట్టారు. ఆయనతో పాటు ఆయన రెండో భార్య విజయ నిర్మల కూడా ఈ సంపాదనలో భాగం పంచుకుంది.

ఆమె కూడా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మహేశ్ తల్లిని కాదని కృష్ణ విజయ నిర్మలతో ఉండేవారు. తర్వాతి కాలంలో కృష్ణ ఇద్దరు భార్యలు మరణించారు. ఇప్పుడు ఆస్తుల విషయంలో కొన్ని వదంతులు వస్తున్నట్లు తెలుస్తుంది. కృష్ణ, విజయ నిర్మల కలిసి చాలా ఆస్తులు సంపాదించారు.

విజయ నిర్మలతో కృష్ణ సంపాదించిన ఆస్తులు

కృష్ణ విజయ నిర్మలతో కలిసి సంపాదించిన ఆస్తులు ఎవరికి దక్కుతాయనే చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా తండ్రి స్థానంలో ఉన్న కృష్ణ ఆస్తులకు వారసులు మహేశ్ బాబు, రమేశ్ బాబు మాత్రమే. కానీ ఇప్పుడు రమేశ్ బాబు బతికి లేరు. అయినా రమేశ్ కుటుంబ సభ్యులకు ఆ ఆస్తుల్లో వాటా దక్కాలి. కృష్ణ తొలినాళ్లలోనే ఎవరికి ఇచ్చేది వారికి ఇచ్చేశాడు. అంటే కొడుకులకు తన ఆస్తులు పంచాడన్న మాట.

ఇక ఆ తర్వాత విజయ నిర్మల్ తో కలిసి ఉన్న కృష్ణ మరిన్ని ఆస్తులను పోగు చేశాడు. దానిలో వాటాలపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కృష్ణ-విజయ నిర్మల కలిసి నానక్ రాం గూడలో ఒక ఇల్లు కట్టారు. దాదాపు 10 ఎకరాల్లో ఉన్న ఈ ఇంటి నిర్మాణం విజయ నిర్మలతో పెళ్లయిన తొలినాళ్లలో చేశారు. ఈ ఇంట్లో ప్రస్తుతం విజయ నిర్మల్ కొడుకు నరేశ్, విజయ నిర్మల సోదరులు నివసిస్తున్నారు.

ఆ ఇంటి విషయంలో

తండ్రితో ఇన్నాళ్లు ఉన్న మహేశ్ బాబు ఆస్తుల విషయంపై పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆస్తుల విషయం వచ్చే సరికి సదరు బంగ్లా, ఇంకా విజయ నిర్మలతో కలిసి పోగు చేసిన ఆస్తులను ఎవరికి ఏ పద్ధతిలో పంచాలనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నానక్ రాం గూడలోని నరేశ్ ఉంటున్న ఇంటి గురించి మహేశ్ అడుగరని అనుకుంటున్నా, అతనికే అప్పజెప్పే పరిస్థితి మాత్రం లేదు. మహేశ్ నరేశ్ కు ఆ ఆస్తి ఇస్తే రమేశ్ బాబు కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తన సొంత అన్న కుటుంబం కోసం మహేశ్ బాబు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ప్రస్తుతం నరేశ్ పవిత్ర లోకేశ్ తో కలిసి ఉంటున్నాడు. ఆ జంటకే ఇంటిని వదిలేస్తాడా అన్నది కూడా అనుమానమే. ఆస్తి పంపకాలు ఎలా ఉంటాయో ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఈ ఆస్తుల పంపకాల్లో ఎవరు ఎటువైపు ఉంటారో.. ఏ పెద్దమనిషి అందరికీ సమ న్యాయం చేస్తారో అన్న చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో గాసిప్స్ గా మారాయి.